రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాదనలు వినేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే చెప్పింది. కేసు రీ-ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన అప్లికేషన్ ను అనుమతించిన ఎన్జీటి విచారణకు అంగీకరించింది. ఇప్పటికే తెలంగాణ వాసి శ్రీనివాస్ వేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన ఎన్జీటీ… తెలంగాణ ప్రభుత్వ తాజా అప్లికేషన్ తో తీర్పు వాయిదా వేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తమకు సమయం సరిపోలేదని అప్లికేషన్ లో పేర్కొన్న తెలంగాణ… తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. ఇక ఈ వివాదానికి సంబంధించి కేంద్రం కూడా జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. అపెక్స్ కమిటీ భేటీ జరగాల్సి ఉండగా కేంద్ర మంత్రికి కరోనా రావడంతో వాయిదా పడింది.