తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ పార్టీలు కేంద్రం లో ఉన్న బీజేపీ ని ఎదురించాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యడు బీవి రాఘవులు అన్నారు. బీజేపీ పై తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ చేస్తున్న విమర్శలు సరైనవే అని తెలిపాడు. ఇలాగే వైఎస్ఆర్‌సీపీ కూడా బీజేపీ ని ఎదురించాలని అన్నాడు. తెలంగాణ లో రైతుల పండిస్తున్న వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రమే కొనుగోలే చేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
వరి ధాన్యం కొనగోలు విషయం లో కేంద్ర లో బీజేపీ కుంటి సాకులు చెబుతుందని విమర్శించారు. కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని తెలిపారు అలాగే ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రా ల లో ఉన్న అధికార పార్టీలు కలిసి బీజేపీ ని ఎదరిస్తే రాష్ట్రాలకు మంచి జరుగుతుంని బీవీ రాఘవులు అన్నారు.