ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అయితే వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం కూడా ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం, గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం అవుతాయి.
డయాబెటిస్ కారణంగా చనిపోయే రిస్క్ మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువు తగ్గించుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను, డయాబెటిస్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- నేరేడు తినాలి. ఈ పళ్లలో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెర వ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.
- నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యంగా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ వ్యాధి బారినపడ్డ వారు ఎప్పటికప్పుడు వాల్ నట్స్ లాంటి నట్స్ తీసుకోవాలి.
- ఎర్రని ఉల్లిపాయ మధుమేహగ్రస్తులకు చాలా ఉపయోగకరం. పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ గా పనిచేయును. ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి.
- ఆకు కూరల్లో ఉండే పీచు పదార్థం, కాల్షియం, ప్రొటీన్లు, పొటాషియం, ఇతర ఆవశ్యక విటమిన్లు, ఖనిజాలు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండటానికి దోహదం చేస్తాయి.
- ముడి గోధుమలు ఆహారంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు నిలకడగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావన కలిగించడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
- సిట్రస్ పండ్లు ఆరెంజ్, బత్తాయి వీటిలో విటమిన్ సి, ఫ్లావోనోయిడ్స్ రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి సుగర్ లెవల్స్ ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
- బీన్స్‌లో పోషకాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి. తరచుగా బీన్స్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంలో సహయపడుతుంది.