తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలలో ఎక్కువగా తప్పులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా కొంతమందికి స్వేచ్ఛ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తూ ఉంటారు. పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ కావడంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో తమ్మినేని సీతారాం అలాగే ఆర్ కే రోజా, కొడాలి నాని బలమైన నాయకులుగా చంద్రబాబు నాయుడికి కనపడలేదు.
దానికి ప్రధాన కారణం వాళ్ళు మీడియా ముందు మాట్లాడకపోవడమే. ఇప్పుడు వాళ్ళు బలమైన నాయకులుగా కనబడుతున్నారు. వైసీపీలో వాళ్ళకి స్వేచ్చ ఎక్కువగా కనపడిన పరిస్థితి ఉంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి వాళ్లు కూడా బలమైన నేతలుగా ఉన్నారు. కానీ వాళ్లను చంద్రబాబునాయుడు గుర్తించలేకపోయారు. ఇప్పుడు కూడా పార్టీలో అవే తప్పులు ఎక్కువగా మాట్లాడే నేతలు ఉన్నాసరే చంద్రబాబునాయుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడంతో చాలామంది నేతలు పార్టీలో ఉండడానికి ఆసక్తి చూపించడం లేదు.
రాయలసీమ జిల్లాలకు చెందిన చాలా మంది నేతలు మీడియాతో మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. నాయకత్వం లోపాన్ని పరిష్కరించుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నాయకులలో స్పష్టంగా ఒక బలమైన పట్టుదల ఉన్న సరే చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంను విమర్శించడానికి ముందుకు వచ్చే నేతలను కూడా ఆయన అడ్డుకోవడంతో ఇప్పుడు విమర్శలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు ఏమో అనే భావన కూడా పార్టీ నేతలలో ఎక్కువగా పెరిగిపోయింది.