గ్రేటర్‌లో ఓటింగ్‌ శాతంపై అభ్యర్థుల్లో గుబులు..ఐటీ ఉద్యోగుల ఓట్లపై పార్టీలు ఫోకస్‌.!

గ్రేటర్‌ ఎన్నికలకు నిన్నటితో ప్రచారం ముగిసింది..దాదాపు 15 రోజుల నుంచి నగరంలో ప్రచారంతో పార్టీలు హోరెచ్చించాయి..విమర్శలు, ప్రతి విమర్శలుతో పాటు జాతీయ పార్టీ నేతలు,కేంద్రమంత్రుల ప్రచారంతో గ్రేటర్‌లో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది..బీజేపీ-టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీలు సవాల్లు ప్రతి సవాల్లతో గ్రేటర్ ఎన్నికల హీట్ పెంచాయి..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో టెన్షన్‌ వాతావరణం సృష్టించాయి.నేతలపై, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇప్పుటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోల్ మెనేజ్‌ మెంట్‌పై దృష్టి పెట్టారు..వార్డుల వారిగా ఓట్లను ప్రలోభాలను పెట్టేపనిలో నిమగ్నమయ్యాయి.. బహుమతులు,తాయిలాలు, ఇతర అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసే పనిలో ఉన్నాయి..అభ్యర్థులు పోటీ పడిమరి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.ఓటు హక్కును ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని ప్రతీ ఎలక్షన్‌కి ఈసీ..జోరుగా ప్రచారాలు చేస్తోంది..ఎన్నడూ లేనంతగా అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఐనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్‌ పెరగడం లేదు. ఓటింగ్ రోజును హాలీడేగా ఫీలయ్యేవారు కొందరుంటే, ఓటేయాలనున్నా..రకరకాల ఇబ్బందులతో దూరంగా ఉంటున్నవారు మరికొందరు. ఇలా ఓటింగ్‌కు దూరమవుతున్నవారిలో ఎక్కువ శాతం ఐటీ ఉద్యోగులే. ఓటు వేయాలని ఉన్నా,సుదూర ప్రాంతాల్లో ఉండటం, సెలవులు లేకపోవడంతో వారిని ఓటుకు దూరం చేస్తోంది.

ఐటీ ఉద్యోగాలంటేనే రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన వారు 35లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా అందులో 24లక్షల మంది బెంగుళూరు, పూణె, చెన్నై, కోల్‌కత్తా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. సుమారు 5 లక్షల మంది వరకు ఇతర దేశాల్లో ఉన్నారు. ఇందులో 5ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు కనీసం 5శాతానికి కూడా మించట్లేదు. శుభ, అశుభ కార్యాలకు కూడా సొంతూరుకు రాలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు ఐటీ ఉద్యోగులు.

మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్న టెక్కీల ఓట్లపై ఫోకస్ పెట్టారు..ఓటు సామాజిక హక్కే కాదు. సామాన్యుడి ఆయుధం కూడా..అయితే ఏళ్ల తరబడి ఓటు హక్కుకు దూరమవుతున్నారు ఐటీ ఉద్యోగులు..కరోనా వల్ల ఈసారి టెక్కీలకు అవకాశం లభించింది..ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో టెక్కీలను ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చేయడం కొసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు పార్టీలు..
ముఖ్యంగా టీఆర్‌ఎస్‌-బీజేపీ టెక్కీల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు..గ్రేటర్‌లో కొత్త ఐటీ కంపెనీలు తీసుకువారడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కేటీఆర్‌ పదేపదే ప్రచారం చేశారు..ఉద్యోగ ఫలితాలను పత్యేక్షంగా అనుభివిస్తున్న ఐటీ ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపుతారని మంత్రి ఆశలు పెట్టుకున్నారు..మరోవైపు దేశంలో మోడీ పాలనకు యువకులు ఆకర్షితులు అవుతున్నారని, మరి ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో మోడీపై సదాభిప్రాయం ఉందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు..ఉద్యోగాలు కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం చెందిందనే భావనా వారిలో ఉందని అది తమకు అకుకూలంగా మారుతుందని కమలం నేతలు ధీమాతో ఉన్నారు.