పాదయాత్ర చేయనున్న సూపర్ స్టార్ విజయ్… తమిళ రాజకీయాల్లో సంచలనం

-

తమిళనాడు రాజకీయాల్లో త్వరలో సంచలనాలకు తెర లేవబోతోంది.తమిళ సూపర్ స్టార్ విజయ్ తమిళనాడు లో రాజకీయ పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్ చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే తమిళింగా వెట్రి కళగం పార్టీ పేరు ను ప్రకటించిన విజయ్ ఇకపై పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారబోతున్నారు. ఆరునెలల క్రితం పార్టీ పెట్టిన ఆయన 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకున్నారు. చివరిగా ఆయన ఒకేఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా తరువాత ఇక ఫైల్ టైమ్ పొలిటీషన్ గా మారిపోతున్నారు. తమిళ ప్రజలు తనకు అధికారం ఇస్తే చరిత్ర ఎరుగని రీతిలో పరిపాలన చేస్తానని అన్నారు. పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్తున్నారు.

thalapathy vijay

తమిళనాడులో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యంతో యాక్షన్ పాన్ తో పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు నటుడు విజయ్. త్వరలో పాదయాత్ర కు సంబందించిన అన్ని వివరాలు వెల్లడించనున్నారు.

100 నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగే విధంగా విజయ్ ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ పాదయాత్ర ద్వారా తమిళనాడు లో అవినీతి, కులమత విభజన, అధికార దురాచారులు వంటి సమస్యల పై పోరాటమే ఎజెండాగా నటుడు విజయ్ ప్రజలలోకి వెళ్లనున్నారు.

విజయ్ రాజకీయ పాదయాత్రతో తమిళనాడులో రాజకీయoగా ఎలాంటి ప్రభావం చూపిస్తారోనని హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి వివాదాల జోలికి వేళ్ళని విజయ్ ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ వరుసగా రెండుసార్లు ఏ పార్టీ కూడా అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు విజయ్ రాజకీయ అరంగ్రేటం ఆసక్తికరంగా మారింది. తమిళ రాజకీయ రూపురేఖలను శాశ్వతంగా మార్చే విధంగా తన కార్యాచరణ ఉండబోతోందని ఇదివరకే విజయ్ స్పష్టం చేశారు. కాగా తమిళనాడులో రాజకీయ పార్టీ పెడతానని ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రజనీకాంత్ హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే రాజకీయాల్లోకి రావడం లేదని ఇటీవల రజనీ తేల్చేయగా ఇప్పుడు విజయ్ పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారబోతున్నారు. విజయ్ చేపట్టనున్న పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news