సొంత ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు ఫిర్యాదు..!

-

సొంత ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. అయితే అతను  ఎలా దొరికాడో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.  నిర్మల్ జిల్లా కేంద్రంలోని హాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు. స్కూల్ టీచర్ గా పని చేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.

ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా చోరీ జరిగిన ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అందులో ఉన్న విజువల్స్ ప్రకారం.. అనిత భర్త శివ దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. శివను తీసుకువెళ్లి విచారించగా తానే చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయం తెలిసిన వారందరూ ఆశ్చర్యపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news