పవన్ విషయంలో చిరంజీవికి పెద్ద టాస్క్ ఇవ్వబోతున్న ఇండస్ట్రీ!

“రిపబ్లిక్” సినిమా ఈవెంట్ వేదికను జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోయడానికి, ఫలితంగా “మా”ఎన్నికలను ప్రభావింతం చేయడానికి, తద్వారా జనసేనకు ప్రచారం చేసుకోవడానికి పవన్ వాడుకున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మైకందుకుని పూనకం తెచ్చుకున్న పవన్.. ఇండస్ట్రీ లో కొత్త టెన్షన్ కి కారణం అయ్యారు! దీంతో… పవన్ విషయంలో చిరంజీవికి ఒక టాస్క్ ఇవ్వాలని భావిస్తున్నారంట ఇండస్ట్రీ పెద్దలు!

pawan kalyan
pawan kalyan

తన మాట, తన పోరాటం ఇండస్ట్రీ మేలుకోసమే అంటూ పవన్ గట్టిగా మాట్లాడారు. తనదైన శైలిలో ఏపీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వాలతో పనిచేయించుకోవాలంటే అడిగే పద్దతి అది కాదేమో… అయినా కూడా పవన్ ఇన్నర్ ఫీలింగ్ వేరే కాబట్టి… ఫైరైపోయారు. దీంతో… ఇండస్ట్రీ పెద్దలు ఒక్క సారిగా షాక్ తిన్నారు.

ఏపీ ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా జరుగుతున్న స్థితిలో.. టాలీవుడ్ పెద్దలు అడిగినవాటికి జగన్ కూడా సానుకూలంగా స్పందిస్తున్న పరిస్థితిలో.. పవన్ పోరాటం దేనికి సంకేతం అంటూ పెద్దలు ఫీలవుతున్నారు. మాకెందుకొచ్చిన తలనొప్పు అనుకుంటూ.. పవన్ కు మద్దతుగా నిలిచే పనికి దూరంగా ఉన్నారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ అయితే.. పవన్ మాటలకు తమకూ ఏ సంబంధం లేదని చెప్పేసింది.

తన ప్రసంగంలో నానితో పాటు ప్రభాస్, ఎన్టీఆర్, రానా ను కూడా కోట్ చేసినా కూడా వారి నుంచి కూడా మద్దతు రాలేదు! అంటే… ఆ ఒక్క ప్రసంగంతో.. ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు పవన్ ఒక్కరూ ఒకవైపు అనే పరిస్థితి వచ్చేసింది. ఫలితంగా… పవన్ పై ఓ చిన్నసైజు తిరుగుబాటుకు టాలీవుడ్ సిద్ధమౌతోందట. అందులో భాగంగా… “ఇకపై ఇండస్ట్రీ విషయల్లో పవన్ ను జోక్యం చేసుకోకుండా ఉండమని” చిరంజీవి ద్వారా చెప్పించే ప్రయత్నాలు స్టార్ట్ చేసిందంట!

అలా పవన్ కు చిరంజీవి చెప్పడం పెద్ద విషయం కాదు! పిలిచి కూర్చోబెట్టుకునో, ఫోన్ లో మాట్లాడో చిరంజీవి చెప్పేస్తారు! కానీ… అన్న చిరంజీవి మాటకు పవన్ విలువిస్తారా లేదా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. “మీరు గట్టిగా మాట్లాడరు, నన్ను మాట్లాడనివ్వరు ఎందుకు” అంటూ పవన్ అడ్డం తిరుగుతారా? లేక, ఇకనుంచి ఇండస్ట్రీ విషయాలపై మాట్లాడకుండా తన సినిమాలేవో తాను చేసుకుంటూ – తన రాజకీయాలేవో తాను నడుపుకుంటూ ఉంటారా అన్నది వేచి చూడాలి!