‘ ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా. ఈ సినిమాలో చాలా అబద్దాలు చూపించారని ఆరోపించారు. 1990లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికాంలో లేదని… కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో ఆ సమయంలో కాశ్మీర్ లో గవర్నర్ పాలన నడుస్తుందని ఆయన అన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కల్పిత కథగా కొట్టిపారేశారు. దక్షిణ కుల్గామ్ లోజరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒమర్ అబ్ధుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ఇది అసలు సినిమానా.. డ్యాక్యుమెంటరీనా అనేది స్పష్టంగా తెలియదని కామెంట్ చేశారు. ఈ సినిమా వాస్తవికత ఆధారంగా రూపొందించబడలేదని ఆయన ఆరోపించారు. కేవలం కాశ్మీర్ పండిట్లు మాత్రమే చంపబడలేదని.. ముస్లింలు, సిక్కులు కూడా చంపబడ్డారని..వారు కూడా కాశ్మీర్ వదిలి వలస వెళ్లారని ఆయన అన్నారు.