ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు రెండు డైలాగులు బాగా వాడుతున్నారు. అదేంటంటే…తాము అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళకు వడ్డీతో సహ చెల్లిస్తామని అంటున్నారు. అలాగే తాము అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేస్తే అసలు జగన్ బయటకు తిరిగేవాడు కాదని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ టిడిపి అధికారంలోకి వస్తే అనే మాటని పక్కనబెడదాం..ఎందుకంటే ఊహాజనిత మాటలకు ఇప్పుడు వివరణ ఇవ్వలేం. ఎందుకంటే నెక్స్ట్ టిడిపి అధికారంలోకి రాగలదో లేదో…జనాలకు బాగా తెలుసు. కాబట్టి ఆ విషయం పక్కనబెడితే…తాము అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేస్తే జగన్ బయట తిరిగేవాడు కాదు.
ఇదే మాట టిడిపి నేతలే కాదు…చంద్రబాబు కూడా అంటున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడూ నేరాలు చేయలేదని, తాను రౌడీయిజం చేయాలనుకుని ఉంటే జగన్ బయటకు వచ్చేవాడే కాదని మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలు ఎంత కామెడీగా ఉన్న నవ్వకుండా…బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. జగన్‌ని అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు.
అలాగే వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టి జైల్లో పెట్టారో కూడా తెలుసు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెడితే చాలు వారిపై కేసు పెట్టేవారు. ఇందులో జనసేన కార్యకర్తలు కూడా బాధితులే. ఇక ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న జగన్‌ని విశాఖ ఎయిర్‌పోర్టులో అడ్డుకుని రచ్చ చేసిందో ఎవరో కూడా తెలుసు. అలాగే ఆయన ఏదైనా అంశాలపై పోరాటం చేయాలనుకుంటే పోలీసులు చేత అడుగడుగున అడ్డుతగిలేలా చేశారు.
ఇక అసెంబ్లీలో అయితే చెప్పాల్సిన పని లేదు…వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలని తీసుకుని రివర్స్‌లో జగన్‌పై మాటల దాడి చేశారు. ఆయనకు ఎక్కడకక్కడ మైక్ దక్కకుండా చేశారు. అలాగే తనపై కేసులని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ హేళన చేశారు. ఇలా చాలా రకాలుగా జగన్‌ని చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అవన్నీ చూసే ప్రజలు జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. కాబట్టి బాబు కామెడీ డైలాగులు వేయడం ఆపేసి రియాలిటీ మాట్లాడితే బెటర్.