భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో తీసిన భర్త.. నెల్లూరు జిల్లాలో దారుణం

-

ఆత్మహత్య మహా పాపం. ఆ ఆలోచన ఎవరికైనా వచ్చినా అది తప్పు అని చెబుతారు. ఎవ్వరైనా సరే ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లయితే వారి మనసును మార్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన అందుకు విరుద్ధంగా ఉంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పెంచలయ్య అనే వ్యక్తి తన భార్య కొండమ్మ ఉరి వేసుకుంటుండగా ఆపకపోగా వీడియో తీసాడు. పక్కనే ఉన్నప్పటికీ భార్య ఆత్మహత్యను ఆపలేదు.

భార్యను అనుమానంతో వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పాడని అక్కడి స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న భార్యను ఆపకుండా వీడియో తీసి రాక్షసానందం పొందిన పెంచలయ్య, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. భార్యా భర్తల మధ్య ఎలాంటి తగాదాలు ఉన్నాయి, భర్త పెంచలయ్య మానసిక పరిస్థితి ఏంటనే విషయమై పోలీసులు దర్యాఫ్తు చేయనున్నారు. భార్య ఆత్మహత్యను వీడియో తీసిన భర్త పైశాచికత్వం చూస్తుంటే మానవత్వం మంటగలిసిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news