ఎమ్మెల్యేలకు అండగా మంత్రులు… కేసీఆర్ లో పెరుగుతున్న కోపం

-

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే కొంతమంది మంత్రులకు మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి అనే ప్రచారం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఆ సమస్యలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే విషయంలో విఫలమవుతున్నారు. వాళ్ల విషయంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మంత్రులు వాళ్లను వెనకేసుకొస్తున్నారు.

సీఎం కేసీఆర్

దీనివలన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ కు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏంటనే దానిపై అవగాహన అనేది 2014 నుంచి కూడా దాదాపుగా లేదు. కొంతమంది నేతలు ఏది చెప్తే సీఎం కేసీఆర్ అదే నమ్ముతూ ఉంటారని కూడా కొంత మంది అంటూ ఉంటారు. కొంతమందిని ప్రత్యేకంగా నియోజకవర్గానికి పంపినా వాళ్లు కూడా కొంతమందికి మాత్రమే సమాచారం ఇస్తూ సీఎం కేసీఆర్ ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అని ఆ మధ్య కాలంలో ప్రచారం జరిగింది.

ఇలాంటి సమస్యలు టిఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా తీవ్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాదాపు అదే జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కోసం ప్రచారం చేయకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ మీద సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని సిద్ధమవుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు మంత్రులు అండగా నిలబడటంతో సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news