నేడు మోదీ ప్రసంగం లేనట్టేనా?.. దాంతోనే స‌రిపెట్టుకోవాలా..?

-

ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ఏ స్థాయిలో విజృంభిస్తుంది తెలియ‌న‌ది కాదు. గ‌త ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వూహ‌న్ నుంచి పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌మంత‌టా త‌నే రాజై ఏలుతోంది. ఈ ర‌క్క‌సి దెబ్బ‌కు ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు విల‌విల‌లాడిపోతున్నాయి. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్న.. దీని ప్ర‌భావం మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇందుకు భార‌త్ కూడా మిన‌హాయింపు కాదు. భార‌త్‌లో సైతం క‌రోనాను నియంత్రించేందుకు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

ఇక ఇప్ప‌టికే భార‌త్‌లో కరోనా సాజిటివ్ కేసుల‌ సంఖ్య 7447కు చేరగా.. మరణాల సంఖ్య 239కి చేరుకుంది. అయితే ప్ర‌స్తుతం భార‌త్‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14తో ముగుస్తుంది. దీంతో కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ పొడిగింపునపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే నేడు పీఎం న‌రేంద్ర మోదీ ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఇక మోదీ వీడియో కాన్ఫరెన్స్ అనంతర పరిణామాలు లాక్‌డౌన్ మరో రెండు వారాలు కొనసాగనుందనే సంకేతాలనిస్తున్నాయి.

అయితే వాస్త‌వానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని భావించినా.. నేడు ప్రధాని మోదీ ప్రసంగం ఉండబోదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుండగా, ఆపై మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎంలతో ప్రధాని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మోదీ అధికారికంగా ప్రకటిస్తారని అంద‌రూ భావించినా.. కేంద్ర వర్గాల ప్రకారం మ‌రో రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని స‌మాచారం. ఇక మోదీ ప్ర‌సంగం లేక‌పోవ‌డంతో.. నేటికి మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌తో స‌రిపెట్టుకోవాల‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news