కరోనా కంటే డేంజర్ ఇది .. అమెరికా లో కొత్తగా ఏం కొంటున్నారో చూడండి !

-

ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రరాజ్యం అమెరికా ని గజగజ వణికిస్తోంది కరోనా వైరస్. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా అమెరికాలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా దేశం మొత్తం కరోనా వైరస్ తో నిండిపోయింది అని చెప్పవచ్చు. ఇటువంటి తరుణంలో అమెరికన్లు తమను తాము రక్షించుకోవడానికి కొత్తగా మార్కెట్లో ఏం కొంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే అమెరికన్లు ఎక్కువగా ఇటీవల తుపాకులను బాగా కొంటున్నారట. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్న తరుణంలో అమెరికా దేశంలో ప్రస్తుతం తుపాకులకు బాగా గిరాకీ పెరిగిందట. ఇదే విషయాన్ని ఎఫ్ బీఐ తెలిపింది.21 Unbelievable Facts About Guns in America | The Fiscal Timesగతంలో పోల్చుకుంటే ప్రస్తుతం అమెరికాలో ఈ ఏడాది 80 శాతం తుపాకుల కొనుగోలు పెరిగినట్లు అది కూడా కరోనా వైరస్ దేశంలో ఎంటరైన టైములో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు అమెరికా దేశం ఎఫ్ బీఐ లెక్కలతో సహా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా దేశంలో ప్రజలు ఇంత పెద్దమొత్తంలో తుపాకులు కొనుగోలు చేయడం కోసం రావడంతో మార్చి 16 నుంచి నెలాఖరు వరకు 1.2 మిలియన్ల మంది నేపథ్యాన్ని ప్రైవేటు డీలర్ల దగ్గర చెక్ చేశామని వివరించారు.

 

కాగా అమెరికాలో గన్ కల్చర్ గురించి అందరికీ తెలుసు. ఎవరికి వారు విచక్షణరహితంగా స్కూల్లో మరియు షాపింగ్ మాల్స్ లో చొరబడి తమ దగ్గర ఉన్న తుపాకులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కొన్ని సార్లు విచక్షణారహితంగా కాల్చేసిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో తాజా పరిణామంతో కరోనా కంటే ఇది చాలా డేంజరస్ అని చాలామంది అంటున్నారు. మరోపక్క తుపాకీ కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు వ్యక్తిగత భద్రత కోసమేనని దరఖాస్తు చేసుకుంటున్నారని గన్ కొనుగోలు చేస్తున్నారు అంటూ ఎఫ్ బీఐ చెప్పుకొస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news