రామచంద్రాపురంలో మారుతున్న సీన్…జగన్‌తో తోట భేటీ.!

-

గత కొన్ని రోజులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వైసీపీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాలకు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ సీటులో తాను గాని, తన తనయుడు గాని పోటీ చేస్తామని బోస్ ప్రకటించారు. ఒకవేళ వైసీపీ సీటు వేణుకి ఇస్తే..ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికైనా రెడీ అంటున్నారు.

అయితే ఈ విభేదాల నేపథ్యంలో ఇటీవల జగన్..బోస్‌ని పిలిపించి మాట్లాడారు. అయినా బోస్ వెనక్కి తగ్గలేదు. వేణుకు ఇస్తే ఓడిస్తామని అంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెబుతున్నారు. లేదంటే బోస్ టి‌డి‌పి లేదా జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పుడు పొత్తులో పోటీ చేయవచ్చు. ఇక ఇలా వివాదాల నేపథ్యంలో అదే నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులుని జగన్ పిలిపించి మాట్లాడారు. ఒకవేళ బోస్ పార్టీ వీడితే పార్టీకి నష్టం జరగకుండా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచించినట్లు తెలిసింది.

వాస్తవానికి మంత్రి వేణు, ఎంపీ బోస్, ఎమ్మెల్సీ తోట..ఈ ముగ్గురిది రామచంద్రాపురం నియోజకవర్గమే. గతంలో బోస్..రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. అటు తోట రెండుసార్లు టి‌డి‌పి, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో బోస్…మండపేట వచ్చి పోటీ చేసి ఓడిపోయారు. ఇటు రామచంద్రాపురంలో వేణు గెలిచారు. వేణుకు బోస్ సపోర్ట్ చేశారు. అక్కడే టి‌డి‌పి నుంచి తోట ఓడిపోయారు.

ఇక బోసు ఓడిపోయిన సరే జగన్..ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. మండలి రద్దు అనడంతో బోస్ రాజీనామా చేశారు. ఆ వెంటనే రాజ్యసభ ఇచ్చారు. ఇటు వేణుకు మంత్రి పదవి దక్కింది. అలాగే తోట వైసీపీలోకి వచ్చారు. మండపేట బాధ్యతలు దక్కాయి. ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు బోసుకు ఏ సీటు లేదు. అందుకే రామచంద్రాపురంపై ఫోకస్ పెట్టారు.

ఆ సీటు దక్కకపోతే వైసీపీని వీడేలా ఉన్నారు. బోస్ వీడితే నష్టం లేకుండా జగన్..తోటతో మాట్లాడారు. తోటకు రామచంద్రాపురంలో బలమైన వర్గం ఉంది. ఇటు మండపేటలో కూడా ఇబ్బంది లేకుండా చేసేలా చూస్తున్నారు. మరి చూడాలి బోస్ చివరికి వైసీపీని వీడుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news