ఎన్నికలు సమిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ లో అసమ్మతి నేతలు ఏకం అవుతున్నారు. చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు.. విశాఖ నార్త్ నియోజకవర్గములో ముఖ్య నేతలు చంద్రబాబు తీరు పై ఆగ్రహం తో ఉన్నారట.. బీజేపీ కి చెందిన నేతను పార్టీలోకి తీసుకొచ్చి mla టికెట్ ఇవ్వాలని అయన భావిస్తున్నారట.
గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గము నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు.. పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడంతో సైసిన నియోజకవర్గం వైపు చూడటమే మానేశారట.. ఓటేసిన ప్రజలను .. పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోవడమే మానేశారని పార్టీ నేతలు చెబుతున్నారు..వచ్చే ఎన్నికల్లో ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గంటా అనుచరులు చెబుతున్నారు.. ఈ క్రమంలో విశాఖ నార్త్ నుంచి పోటీలో నిలిపేందుకు టీడీపీకి అభ్యర్థులు కరువు అయ్యారు. దింతో చంద్రబాబు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజును టిడిపిలోకి తీసుకొని.. అక్కడ నుంచి పార్టీ చేయించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. విషయం తెలుసుకున్న టిడిపి క్యాడర్ చంద్రబాబు నిర్ణయంపై మండిపడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తుంది..
విష్ణు కుమార్ రాజుకు పార్టీ టికెట్ ఇస్తే.. సహకరించే ప్రసక్తే లేదని టిడిపి క్యాడర్ స్ట్రాంగ్ గా అధిష్టానానికి చెప్పిందట. 2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తు కారణంగా ఈ నియోజకవర్గము నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలుపొందారు.. గెలిచిన తర్వాత విష్ణుకుమార్ రాజు టిడిపి కార్యకర్తలు ముఖ్య నేతలను వేధించారట.. పలు కేసుల్లో కొందరిని జైలుకు కూడా పంపించారని పార్టీ నేతలు చెబుతున్నారు.. అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని నేతలు తెగేసి చెబుతున్నారట.. ఈ మేరకు ముఖ్య నేతలు సమావేశమై చర్చించుకున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. పార్టీ నేతల బెదిరింపులతో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..