విజయవాడ ఎంపీ నాని సంచలన నిర్ణయం.. త్వరలో స్పీకర్ ను కలవనున్న నాని..

-

తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారిన విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. పార్టీకి తన అవసరం లేనప్పుడు.. ఇక ఎంపీగా కొనసాగడంలో ప్రయోజనం లేదని ఆయన నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కేశవ నాని ని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి.. ఇంతకీ కేసినేని స్పీకర్ ఎప్పుడూ కలవబోతున్నారు??


విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా పై తెలుగుదేశం పార్టీలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంది.. చంద్రబాబు తన స్వలాభం కోసం కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య నిప్పు రాజేశారని టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు.. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశించిన నానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.. దీంతో పార్టీ ఆయన్నీ దూరం పెట్టడం.. పార్టీ కార్యక్రమాలకు ఎంపీ నాని అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ ఉండటం గత కొన్నేళ్లుగా జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో నేరుగా చంద్రబాబును ఉద్దేశించి నాని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే బుద్ధ వెంకన్న, కేశినేని చిన్నిలు నానికి వ్యతిరేక వర్గంగా తయారయ్యారు.. ముగ్గురు మధ్య జరుగుతున్న అంతర్గత పోరు వీధికి ఎక్కడంతో బెజవాడలో టిడిపి పార్టీ డ్యామేజ్ అవుతుందని అధిష్టానం గుర్తించింది..

కేశినేని నాని కి చెక్ పెట్టేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.. ఆయన సోదరుడు కేసినేని చిన్నిని ప్రోత్సహించి వచ్చే ఎన్నికల్లో టికెట్ స్థానం అంటూ పరోక్ష సంకేతాలు పంపడంతో చిన్ని స్పీడ్ అయ్యారు.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తరువాత తాను పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావిస్తున్నానని నానీ ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదం చేయించుకుంటానని తెలిపారు. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు.. నాని తీసుకుని నిర్ణయంపై విజయవాడ టీడీపీ లో కలకలం రేగుతుంది.. నాని రూపంలో టిడిపికి వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగలబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

 

Read more RELATED
Recommended to you

Latest news