2024 ఎన్నికల్లో బీజేపీని తొలగించాలి… బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపు

-

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గద్దె దించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జయ్ ప్రకాష్ మజుందార్ దీదీ సమక్షంలో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ అల్లర్లు, అవినీతి పార్టీ అని… వారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని.. ఆమె విమర్శించారు. నిన్న శాసనసభలో జరిగిన ఘటనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన టీఎంసీ మహిళా ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. 

రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో… టీఎంసీ అధినేత్రితో పాటు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. వీరిద్దరు ఒకే వేదికపై పాల్గొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి బీజేపీ పార్టీలోని పలువురు నాయకులు టీఎంసీలో చేరుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ రిగ్గింగ్ కు పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news