ఆ జిల్లా నేతల ప్రభావాన్ని తగ్గిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి..!

-

టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy ) కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలను కలుపుకుని ప్రజాక్షేత్రంలో పార్టీని బలపర్చుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దళిత, ఆదివాసీ దండోరా చేయాలని ప్లాన్ చేశారు. అయితే, రేవంత్ తెలంగాణలోని ఆ జిల్లాకు చెందిన నేతలను మాత్రం పార్టీలో అవకాశమివ్వడం లేదని, వారి ప్రభావాన్ని పూర్తిగే తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారెవరు? తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

 

నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి మంత్రిగా ఏళ్లపాటు సేవలందించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతిపక్షనేతగాను ఉన్నారు. అయితే, ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కాగా ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నప్పటికీ కనిపించడం అంతంత మాత్రమే. ఇక ఈ జిల్లా నుంచి కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మొన్నటి వరకు టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర, నల్లగొండ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. కాగా, వీరి ప్రభావాన్ని రేవంత్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయ కార్యక్రమాల్లో ఉత్తమ్‌తో పాటు కోమటిరెడ్డ బ్రదర్స్‌కు రేవంత్ స్థానమివ్వడం లేదనే చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినా టీపీసీసీ చీఫ్ కనీసం స్పందించలేదని, ఓ ప్రకటన కూడా చేయలేదని పార్టీ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి మైక్ లాక్కుని ఓ కార్యక్రమంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్‌రెడ్డి నినాదాలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక వెంకట్‌రెడ్డి సైతం తన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమాలకే హాజరవుతున్నారు. రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అస్సలు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ కావాలనే దూరం ఉంచుతున్నారా? వారి ప్రభావాన్ని రాష్ట్రస్థాయిలో తగ్గించడం కోసమే అలా చేస్తున్నారా? ఏదైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news