టీటీడీ బోర్డు మెంబర్‌గా టీఆర్‌ఎస్ నాయకుడు?

-

టీటీడీ బోర్డులో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి మెంబర్‌షిప్ ఇవ్వనున్నారట. ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. పాత బోర్డును రద్దు చేసిన సీఎం జగన్.. కొత్త బోర్డును నియమించనున్నారు.

అవును.. టీటీడీ బోర్డు మెంబర్‌గా టీఆర్‌ఎస్ నేతకు అవకాశం కల్పించనున్నారట. టీడీపీ అధికారంలో ఉన్నప్పటి ఏపీ వేరు.. ఇప్పటి ఏపీ వేరు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్.. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యలను కొలిక్కి తీసుకువస్తున్నారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సహకరిస్తున్నారు. నిజానికి.. తెలంగాణ సీఎం కేసీఆర్.. ముందు నుంచి కూడా రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చిత్తశుద్ధితోనే ఉన్నారు.

కానీ.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాటిపై అంతగా దృష్టి పెట్టలేదు. దీంతో విభజన సమస్యలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కానీ.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం రెండు రాష్ర్టాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో.. పరస్పరం సహకరించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం రెండు రాష్ర్టాల మధ్య అనుబంధం పెరిగింది.

ఈక్రమంలోనే టీటీడీ బోర్డులో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి మెంబర్‌షిప్ ఇవ్వనున్నారట. ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. పాత బోర్డును రద్దు చేసిన సీఎం జగన్.. కొత్త బోర్డును నియమించనున్నారు. అందులో కొత్త సభ్యులను ఎంపిక చేసుకోనున్నారు. ఆ సభ్యుల్లో ఒక సభ్యుడిగా టీఆర్‌ఎస్ నేతకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. దీంతో టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నేతలు బోర్డు మెంబర్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నారట.

హుజూరాబాద్‌కు చెందిన దొంత రమేశ్‌ను టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని మంత్రి ఈటల రాజేందర్.. ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈనేపథ్యంలోనే బోర్డు మెంబర్‌గా టీఆర్‌ఎస్ నుంచి ఎవరిని తీసుకుంటారోనని కాస్త సస్పెన్స్ నెలకొన్నది. త్వరలోనే బోర్డులోకి ఎవరిని తీసుకునేది తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news