మేయర్ పీఠం కోసం టిఆర్ఎస్ సరికొత్త వ్యూహం

-

గ్రేటర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టిఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తుందా.. గెలిచిన కార్పొరేటర్లు,ఎక్స్ అఫిషియో సభ్యుల బలం సరిపోతుందా టిఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అమలుచేయనుంది..మేయర్ పీఠాన్ని ఎలా చేజిక్కించుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ,డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది .గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లను టిఆర్ఎస్ దక్కించుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసి కౌన్సిల్లోని కోరం ఉండి..అందులో ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇదే సమయంలో ఎంఐఎం ఎటువంటి వైఖరి అవలంబించబోతోంది అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

150 మంది కార్పొరేటర్లు, యాభైకి పైగా ఉన్న ఎక్స్ అఫీషియో ఓటర్లు మొత్తం హాజరైతే.. మెజార్టీ మార్క్ వంద దాటాలి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. కాకుండా మేయర్ అభ్యర్థిని నేరుగా ఎంపిక చేసుకుంటే టీఆర్ఎస్ తరపున మేయర్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వస్తాయి. బీజేపీ తరపున.. ఎంఐఎం తరపున మేయర్ అభ్యర్థులుగా ఎవరైనా నిలబడితే.. వారికి వారి ఓట్లు వస్తాయి. ఆ ప్రకారం చూస్తే.. టీఆర్ఎస్‌కే మెజార్టీ ఉంటుంది.ఈ పద్దతిలో ఎన్నిక నిర్వహిస్తే సమస్య పరిష్కారంఅవుతుందని టీఆర్ఎస్ పెద్దలు అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు.

గెలిచిన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని గులాబీ అంచనా వేస్తోంది. ఇప్పటికే మేయర్ గా తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యనేతలను కలసి ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు రాజ్యసభ ఎంపీ కేకే కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డితో పాటు భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి,ఆల్వాల్ కార్పొరేటర్ చింతల విజయ శాంతిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.అలాగే వారి బలాలు, బలహీనతలపై కూడా పార్టీలో చర్చ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news