టీఆర్ఎస్‌కు వరుస షాకులు…హరీష్ అడ్డాలో కారు రివర్స్..

-

టీఆర్ఎస్ జెండా పండుగ వేళ, ఆ పార్టీకి ఊహించని షాకులు తగిలాయి. పార్టీ బలోపేతం కోసం, టి‌ఆర్‌ఎస్ అధిష్టానం సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం కోసం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా టి‌ఆర్ఎస్ జెండా పండుగని నిర్వహించారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు జెండాను ఆవిష్కరించారు. అయితే ఇదే సమయంలో తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ, కమ్మగూడలో టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ఎంపీటీసీ సుజాతామోహన్‌ నాయక్‌, దేశ్యానాయక్‌లతో పాటు వందమందిపైనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

harishrao
harishrao

ఇటు వచ్చేసరికి మంత్రి హరీష్ రావు…సొంత అడ్డా సిద్ధిపేటలో సైతం టి‌ఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీలో మొదట నుంచి పనిచేస్తున్న నాయకుడు, ఉద్యమకారుడు గుండు రవితేజ టి‌ఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. మొదట నుంచి పార్టీలో పనిచేస్తున్నా సరే సరైన గౌరవం దక్కడం లేదని చెప్పి రవితేజ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరినవారికి ప్రాధాన్యత ఉంటుంది గానీ, తమ లాంటి ఉద్యమ నాయకులకు టి‌ఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి అయ్యాక మరింత మంది టి‌ఆర్‌ఎస్‌ని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్‌పై ఫోకస్ చేసి అక్కడ టి‌ఆర్‌ఎస్‌ని గెలిపించడం కోడం ఇతర పార్టీ నాయకులని తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. కానీ హరీష్ సొంత అడ్డా సిద్ధిపేటలో మాత్రం రివర్స్ రాజకీయం నడుస్తోంది. ఇక్కడ టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. అయితే సిద్ధిపేటలో మరింత మంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news