కారు రివర్స్: కమలం కట్టడి?

-

అధికార టీఆర్ఎస్‌కు ఎక్కకక్కడ చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది నుంచి తెలంగాణలో బీజేపీ బాగా దూకుడుగా ఉంటుంది.. టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేలా పనిచేస్తుంది. పైగా దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించి బీజేపీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది.. నెక్స్ట్ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టే సత్తా ఉన్న పార్టీగా బీజేపీ ఎదిగింది. ఇక ఈ మధ్య కాలంలో కమలం పార్టీ మరింత దూకుడుగా రాజకీయం చేస్తుంది.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, కారు పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది.

bjp-trs
bjp-trs

ధాన్యం కొనుగోలు, నిరుద్యోగుల సమస్యలు, జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పోరాటం చేసి, దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ అంశాల్లో టీఆర్ఎస్‌ని బాగానే ఇరుకున పెట్టారు. ఇలా తమని ఎక్కడకక్కడ ఇరుకున పెడుతున్న నేపథ్యంలో కారు పార్టీ కూడా రివర్స్ అయింది..కమలాన్ని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..తెలంగాణకు ఏమి చేయడం లేదని విమర్శించడం మొదలుపెట్టింది. డైరక్ట్ కేసీఆర్ రంగంలోకి దిగి కమలంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే కారు పార్టీ విమర్శలు కమలం నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. కానీ తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై మాట్లాడి.. అనవసరంగా తెలంగాణలో బీజేపీని ఇరుకున పెట్టారు. ఆయన ఏదో కాంగ్రెస్‌ని ఇరుకున పెట్టాలని చూసి.. గతంలో ఉమ్మడి ఏపీ విభజన సరిగ్గా చేయలేదని మాట్లాడారు.  అలా అని తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు.

అయినా సరే టీఆర్ఎస్ శ్రేణులు దొరికిన అస్త్రాన్ని ఎందుకు వాదులుకుంటాయి..అదిగో మోదీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి.. డైరక్ట్ మంత్రులు సైతం రోడ్లపైకి వచ్చారు. అంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ని లేపి బీజేపీని విలన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ కాస్త ఆత్మరక్షణలో పడినట్లు అయింది. ఇప్పుడు టీఆర్ఎస్‌కు దూకుడుగా కౌంటర్లు ఇవ్వడంలో వెనుకబడింది..మొత్తానికి కారు పార్టీ కమలాన్ని కాస్త కట్టడి చేసినట్లే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news