బీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికలకు టీఆర్ఎస్..?

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. దాదాపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనే పేరునే ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే కొత్తగా ప్రకటించబోతున్న జాతీయ పార్టీ పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

నేడు జాతీయ పార్టీ ప్రకటనతోపాటు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మునుగోడులో గెలిచిన జాతీయ పార్టీగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ వేసే నాటికి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

జాతీయ పార్టీ ప్రకటన ప్రక్రియ పూర్తి కాగానే టీఆర్ఎస్ యంత్రాంగం మునుగోడుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనుంది. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. కేటీఆర్, హరీశ్‌ రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ బాధ్యతలు కేటాయించారు. రేపట్నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news