రెడ్డి రాజ్యం: అందరిదీ అదే దారి..!

-

రాజకీయాలని, కులాలని వేరు వేరుగా చూడలేని పరిస్తితి..కులం ఆధారంగానే రాజకీయం నడిపేది..రాజకీయం జరిగేది కులం చుట్టూనే. నేటి రాజకీయం…కుల రాజకీయమే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం బట్టే రాజకీయం నడుస్తోంది. అయితే ఒకప్పుడు ఏపీలోనే కుల రాజకీయం నడిచేది. తెలంగాణలో కాస్త కుల రాజకీయం తక్కువే. కానీ కొన్నాళ్ళ నుంచి తెలంగాణలో కుల రాజకీయం పెరిగిపోయింది.

అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..బీసీలు అధికంగా ఉన్న తెలంగాణలో ఆధిపత్యం రెడ్డి వర్గానిదే. ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్నా..రెడ్డి వర్గానిదే హవా. అంటే తెలంగాణలో రెడ్డి వర్గం డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్‌గా రాజకీయం నడిచింది. అప్పుడు కాంగ్రెస్‌లో రెడ్డి వర్గం హవా బాగా ఉండేది. టీడీపీలో కూడా రెడ్డి వర్గం ఉండేవారు గాని..అక్కడ ఎక్కువ బీసీ నేతలు కనిపించేవారు. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో టీడీపీ వచ్చాక తెలంగాణ నియోజక వర్గాల్లో బీసీలకు ప్రాధాన్యత పెరిగింది.

ఇప్పుడు టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది. విచిత్రంగా ఈ మూడు పార్టీల్లో కూడా రెడ్డి వర్గం నేతల హవా ఉంది. మరీ ఎక్కువగా టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల్లో రెడ్డి వర్గం డామినేషన్ ఎక్కువ. టీఆర్ఎస్‌లో వెలమ వర్గం హవా ఎక్కువగానే ఉన్నా..దానికి తగ్గట్టే రెడ్డి నేతల హవా ఉంది. ఉదాహరణకు మంత్రివర్గంలోనే వారి డామినేషన్ చూస్తే.. ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి..ఈ ఆరుగురు మంత్రులుగా ఉన్నారు.

16 మంది ఉండే క్యాబినెట్‌లో 6 గురు రెడ్డి వర్గం మంత్రులు అంటే..టీఆర్ఎస్‌లో రెడ్డి వర్గానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక 2018 ఎన్నికల్లో టిక్కెట్లూ ఆ వర్గానికే ఎక్కువగా ఇచ్చారు కూడా. 40 మంది రెడ్డి వర్గానికి చెందిన వారు గెలిచారు. అందులో టీఆర్ఎస్ 31 మంది, కాంగ్రెస్‌లో 9 మంది ఉన్నారు. ఇక కాంగ్రెస్‌కు చెందిన వారు కూడా టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కువ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో ఉంటే..ఇంకా కింది స్థాయి పదవులు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు…రెడ్డి వర్గానికి చెందినవారు టీఆర్ఎస్‌లో ఎంతమంది ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

అటు కాంగ్రెస్‌లో మొదట నుంచి డామినేషన్ రెడ్డి వర్గానిదే. ఆ పార్టీలో కూడా రెడ్డి నేతలు ఎక్కువ. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి..అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌లో కూడా పెద్ద లిస్ట్ వస్తుంది. అయితే కొద్దో గొప్పో బీజేపీలో రెడ్డి వర్గం నేతలు తక్కువ. కానీ ఈ మధ్య బీజేపీ బలపడుతుండటంతో..ఆ పార్టీలో కూడా రెడ్డి నేతలు పెరుగుతున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇక్కడ రెడ్డి డామినేషన్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా..హవా మాత్రం రెడ్డి వర్గానిదే. ఆఖరికి బీసీలు ఎక్కువగా ఉన్న మునుగోడు ఉపఎన్నికలో మూడు పార్టీలు రెడ్డి అభ్యర్ధులనే నిలబెట్టిందంటే..తెలంగాణలో రెడ్డి రాజ్యం నడుస్తోందని క్లియర్‌గా అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news