ఓటమి ఒప్పుకున్న ట్రంప్‌..కొత్త టీమ్‌ను ప్రకటించిన కొత్త అధ్యక్షుడు బిడైన్‌.

ఎంత పెద్ద నియంత్ర అయిన ప్రజల ముందు తల వంచక తప్పదు..ప్రజాస్వామ్య దేశంలో ప్రజా తీర్పే అంతిమ తీర్పు..ప్రపంచలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికాలో ప్రజా తీర్పు ముందు అధ్యక్షుడు ట్రంప్‌ మోకరిల్లక తప్పలేదు..ఎన్నికల్లో రిగ్గింగ్, అవినీతి జరిగిందని, అధికార మార్పిడిపై నానా రాద్దంతం చేసిన ట్రంప్ న్యాయస్థానంలో కూడా ఎదురు దెబ్బతగిలింది..ఇక అన్ని దారులు మూసుకుపోవడంతో చివరికి ఓటమి అంగీకరించారు..జో బిడెన్‌ విజయాన్ని ఒప్పుకుని..అధికార మార్పిడికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు..ట్రంప్ నిర్ణయంతో సంబంధం లేకుండానే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బెడెన్‌ తన టీమ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు.

కేబినెట్‌ సభ్యుల పేర్లను ట్విట్టర్‌ లో ప్రకటించారు. వీరిలో చాలామంది గతంలో ఒబామా-బైడెన్ హయాంలో పనిచేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు.. తమ టీమ్‌ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తుందని విశ్వసిస్తున్నానని బైడెన్‌ ప్రకటించారు..అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయ్యింది.. కేబినెట్లో కొందరి పేర్లను బైడెన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు..

కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌ కు అప్పగించారు. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్ సలహాదారుడు జేక్ సులివాన్‌ ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అవ్రిల్ హేన్స్‌ ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ గా ఎంపికచేశారు.సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్ గ్రెన్‌ ఫీల్డ్‌ ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017మధ్య ఒబామా-బైడెన్ ప్రభుత్వంలో పనిచేసిన వారే.

విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీని కేబినెట్లోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ప్రత్యేకంగా పర్యావరణ రాయబారిగా నియమించారు. 2013-17మధ్య కెర్రీ అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. 2015లో జరిగిన పారిస్ పర్యావరణ ఒప్పందంపై అమెరికా తరఫున సంతకం చేసింది ఈయనే. అయితే ఆ తర్వాతి కాలంలో ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌ కు భిన్నంగా కాబోయే అధ్యక్షుడు బైడెన్ తాను పర్యావరణానికి ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు.

ఇందులో భాగంగానే అమెరికా జాతీయ భద్రతా మండలిలో తొలిసారిగా పర్యావరణ రాయబారి పదవి తీసుకొచ్చారు. ఈ బాధ్యతలను జాన్ కెర్రీకి అప్పగిస్తూ బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధినాయకత్వాన్ని పునరుద్ధరించాల్సిన సమయం వచ్చింది. ఈ బృందం ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తుందని విశ్వసిస్తున్నా అని బైడెన్ ట్విటర్ వేదికగా చెబుతూ కేబినెట్ మంత్రులను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోను షేర్ చేశారు.