టీఆర్ఎస్‌లో ట్విస్ట్: ఆ ఎమ్మెల్యేలకు షాక్ తప్పదా?

-

తెలంగాణలో వరుసగా రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటిసారి టీఆర్ఎస్ తక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా రెండోసారి మాత్రం మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇలా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌కు రాష్ట్రంలో తిరుగులేని బలం ఉంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే టీఆర్ఎస్‌కు 104 ఎమ్మెల్యేల బలం ఉంది.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలవగా, ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల నుంచి 14 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చారు. అలాగే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది. అయితే దుబ్బాక ఉపఎన్నికలో సిట్టింగ్ సీటులో టీఆర్ఎస్ ఓడింది. అటు ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ లెక్కలన్నీ చూసుకుంటే ప్రస్తుతం టీఆర్ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక కాంగ్రెస్‌కు 6, ఎం‌ఐ‌ఎంకు 7, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక పెండింగ్‌లో ఉంది.

అంటే టీఆర్ఎస్‌కు మొత్తం 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీని బట్టి చూస్తే దాదాపు రాష్ట్రంలో అన్నీ జిల్లాల్లో టీఆర్ఎస్ హవా ఉందని అర్ధమవుతుంది. అయితే 103 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు? ఎంతమంది నెక్స్ట్ ఎన్నికల్లో తిరిగి గెలవగలరు అంటే? చెప్పలేని పరిస్తితి ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.

ఏదో కేసీఆర్ ఇమేజ్, టీఆర్ఎస్ సంక్షేమ పథకాల ద్వారా వారు బండి లాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇలాంటివారికి సీఎం కేసీఆర్ నెక్స్ట్ ఎన్నికల్లో షాక్ ఇవ్వడం గ్యారెంటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలని పక్కనబెట్టి, వేరేవాళ్ళకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ ఛాన్స్ ఇచ్చినా సరే అలాంటి ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news