ఇళ్ల స్థలాల్లో ట్విస్ట్‌లు…ఇద్దరు కలిసి జనాలని ముంచారుగా!

-

జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇళ్ల స్థలాల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చారు. అలాగే మొదట విడతలో భాగంగా 15 లక్షల మందికి ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేస్తుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు ఇస్తుండగా, జగన్ ప్రభుత్వం రూ. 30 వేలు ఇస్తుంది. సరే ఈ డబ్బులు ఇళ్ల నిర్మాణానికి ఏ మాత్రం చాలకపోయినా పేదలు, అప్పులు చేసి మరీ ఇళ్ళు కట్టుకుంటున్నారు.

jagan

అయితే ఇళ్ల స్థలాల్లో వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని టి‌డి‌పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అలాగే సెంటు, సెంటున్నర స్థలాల్లో చిన్న ఇల్లు పడుతుందని, ఇది ఏ మాత్రం ఉపయోగంగా ఉండదని విమర్శించింది. అలాగే స్థలాలని పేదలకు పూర్తిగా రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంపై కూడా విమర్శలు చేసింది. ఇప్పుడు ఈ విమర్శలే పేదల పాలిట శాపంగా మారాయి. జగనన్న ఇళ్ల స్థలాల కార్యక్రమం కింద ఇచ్చిన స్థలాలు, కడుతున్న ఇళ్లు నివాసయోగ్యంగా లేవని పొదిల శివ మురళి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇక హైకోర్టు…పిటిషన్ పరిశీలించి…సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇల్లు ఎలా కడతారని ప్రశ్నించింది. అలాగే స్థలాలని పేదలు అమ్ముకొనివ్వకుండా చట్టం ఎందుకు చేశారని అడిగింది. ఇక వీటితో పాటు ఇంకా కొన్ని సవరణలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అప్పటివరకు ఇళ్ల నిర్మాణం ఆపాలని స్టే ఇచ్చింది. అయితే హైకోర్టులో స్టే వేసింది టి‌డి‌పి అని వైసీపీ ఆరోపిస్తుంది…కాదు కాదు మురళి అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త అని, పేదలకు డబ్బులు ఇవ్వలేక, తప్పించుకోవడానికి ఇలా కోర్టుకు వెళ్ళి ఇళ్ల నిర్మాణం ఆగేలా చేసింది వైసీపీ అని, టి‌డి‌పి ఆరోపిస్తుంది. అయితే రెండు పార్టీలు కలిసే పేదల మోసం చేస్తున్నారని చెప్పొచ్చు…వీరి రాజకీయం వల్ల పేదల ఇళ్ళు ఆగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version