హుజూరాబాద్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..మైండ్ పోతుంది లోపల….

-

ఎక్కడో ఒకడు సినిమా చూసి బయటకొచ్చి…రివ్యూ ఇచ్చేప్పుడు…ఇక్కడ ప్రతి సీన్.. ప్రతి షాట్…మైండ్ పోతుంది లోపల అని చెప్పి హడావిడిగా చెబుతాడు…అక్కడ సినిమాలో ఏం జరిగిందో తెలియదు గానీ…హుజూరాబాద్ ఉపఎన్నిక చూస్తుంటే తెలంగాణ ప్రజలకు మాత్రం అలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వస్తున్నాయి….రోజురోజుకు వ్యూహాలు మారిపోతున్నాయి..గంట గంటకు రాజకీయం మారిపోతుంది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అసలు హుజూరాబాద్ బరిలో ఎవరు గెలుస్తారనే విషయంలో జనాల మైండ్ పోతుంది. ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తారా? లేక టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. మధ్యలో కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీల్చి ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది కూడా తెలియడం లేదు. అయితే ప్రధానంగా ఈటల-టి‌ఆర్‌ఎస్‌ల మధ్య వార్ గట్టిగా జరుగుతుంది. అసలు ప్రచారం ఓ రేంజ్‌లో చేస్తున్నారు….పగటి పుట టి‌ఆర్‌ఎస్…రాత్రి పూట బి‌జే‌పి అన్నట్లుగా ప్రచారం సందడి నడుస్తోంది.

అలాగే ఎవరికి వారు అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతున్నారు. రాజకీయంగా కలిసొచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఎవరి దూకుడు వారిది అన్నట్లుగా పరిస్తితి ఉంది. ఇక నామినేషన్ల పర్వంలో కూడా అనేక ట్విస్ట్‌లు నడిచాయి. ఇక ఈటలని దెబ్బకొట్టడానికి….ఆయన పేరుతో మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. అంటే రాజేందర్ పేరులు హుజూరాబాద్ బరిలో కనిపిస్తాయి.

అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి..ఈటల రాజేందర్‌కు వేయాల్సింది…వేరే వారికి వేసేస్తే ఓట్లు చీలిపోయి ఈటలకు నష్టం జరుగుతుందనే వ్యూహంలో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. అటు ఈటల…తన మనషులని టి‌ఆర్‌ఎస్‌లోకి పంపించారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. హుజూరాబాద్‌లో ఈటలకు అనుకూలంగా ఉండేవారు టి‌ఆర్‌ఎస్‌లో చాలామంది చేరారు. ఇక వారు ఈటలకు అనుకూలంగా పనిచేస్తున్నారని టాక్. టి‌ఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందో ప్రతి విషయం ఈటలకు చేరవేస్తున్నారని తెలుస్తోంది. ఇలా వ్యూహ ప్రతి వ్యూహాలతో హుజూరాబాద్‌లో అనేక ట్విస్ట్‌లు నడుస్తూ…మైండ్ పోయేలా రాజకీయం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news