ముహూర్తం ఫిక్స్: బాబుకు ప్రతిపక్ష హోదా ఫసక్!!

-

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయంగా ఎన్నడూలేనంతగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దానికి బాబు గత ఐదేళ్ల పాలన కారణం కాగా.. తాజాగా కరోనా సమయంలో బాబు తీసుకున్న నిర్ణయాలు మరో కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే… 2019 ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో ప్రతిపక్ష హోదాకే పరిమితమైన టీడీపీకి… ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే తమకు పెద్ద కష్టం కాదని… కానీ, తామే నియంత్రణతో ఉన్నామంటూ జగన్ స్వయంగా శాసనసభలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే… ఈసారి మాత్రం ఆ పని కాస్త పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి! అందుకు వైకాపా ఎంచుకున్న ముహూర్తం… మహానాడు రెండో రోజైన ఎన్టీఆర్‌ జయంతి రోజేనట!

టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయిన సంగతి తెలిసిందే. వారిలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం లు… తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసిన సంగతీ తెలిసిందే. దీంతో వీరిపట్ల బాబుకు రావాల్సిన క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది. ఈ విషయంలో వల్లభనేని వంశీ అయితే అసెంబ్లీలో ప్రత్యేకంగా కూర్చుంటూ బాబుకు డైరెక్ట్ సంకేతాలు ఇచ్చేశారు! ఈ ముగ్గురూ ప్రస్తుతానికి అధికారికంగా వైసీపీలో చేరకపోయినా.. టీడీపీకి మాత్రం దూరమైనట్లే. ఈ సమయంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌ను కలవనున్నారని.. అక్కడే పార్టీలో చేరనున్నారని సమాచారం! గోదావారి జిల్లాలకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఫ్యాన్ కిందకు చేరనున్నారని సమాచారం! ఈ లెక్కన చూసుకుంటే బాబు సంఖ్య అసెంబ్లీలో 17కి చేరుతుంది! ప్రతిపక్ష నేతగా హోదా కొనసాగాలంటే మొత్తం సభలోని సభ్యుల సంఖ్యలో పదో శాతం తగ్గకుండా సభ్యుల మద్దతు ఉండాలి. ఈ లెక్కన చూసుకుంటే… బాబు పరిస్థితి ఏమిటన్నది ఎన్టీఆర్ జయంతిరోజు తేలిపోతుంది!!

కాగా… టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రతిఏటా జరుపుకొనే మహానాడు వేడుకలు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే! గతంలో ఈ మహానాడు వేడుకలు జరగకపోవడానికి ఎన్నికల ఫలితాలు కారణం అయితే.. ఈసారి కరోనా కారణంగా నిలిచింది! ఈ క్రమంలో ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28 నే “బాబుకు ప్రతిపక్ష హోదా ఫసక్” అనే కార్యక్రమం పూర్తిచేయాలని వైకాపా భావిస్తున్నట్లు తెలుస్తుంది!

Read more RELATED
Recommended to you

Latest news