బిజెపికి రెండు రాష్ట్రాల్లో ఊహించని దెబ్బ

-

పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులపై ఎన్డియేలో ఉన్న పక్షాలు అసహనంగా ఉన్నాయి. ఎన్డియే నుంచి బయటకు రావడానికి మూడు పార్టీలు సిద్దం అయ్యాయి. బీహార్ లో జేడియు, బిజెపి కూటమి బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జేడియు మంత్రులు కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న వ్యవసాయ ఆధారిత కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు అందరూ రోడ్ల మీదకు వచ్చారు. దీనితో శిరోమణి అకాలీదళ్ సహా హర్యానా బిజెపి కూటమి పార్టీ జేజేపి ఇప్పుడు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నాయి. దీనితో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వారితో చర్చిస్తున్నారు. జేజేపి ఎమ్మెల్యేలు ఇప్పటికే కేంద్రంపై విమర్శలు చేసారు. పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు హర్యానాలో జేజేపికి.

Read more RELATED
Recommended to you

Latest news