మోదీ ఇలాకాలో కాంగ్రెస్ ’కిసాన్ న్యాయ్‘ ర్యాలీ

యూపీ రైతుల మరణాలు దేశంలో ఇంకా ప్రకంపనలు రేపుతోంది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులతో పాటు 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష పార్టీలు నిరసలను ఇంకా జరగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ రైతుల మరణాలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. తాజాగా మోదీ ఇలాకా వారణాసిలోనే రైతుల మరణాలపై కాంగ్రెస్, రైతు సంఘాలు నిరసన తెలుపనున్నాయి. ’కిసాన్ న్యాయ్ ర్యాలీ‘ పేరుతో నిరసన వ్యక్తం చేయనుంది. ఇప్పటికే ’ఛలో బనారస్‘ పేరుతో కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఇచ్చింది. 

కాంగ్రెస్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో కాంగ్రెస్ రైతులకు మద్దతుగా కార్యక్రమం చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ జనరత్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న కిసాన్ న్యాయ్ ర్యాలీలో కేంద్రం రైతులపై అవలంభిస్తున్నవైఖరిపై, రైతుల సమస్యలపై ఆమె అధికార బీజేపీని నిలదీయనుంది.