‘యోగీ ఆదిత్యనాథ్ అనే నేను‘…. రెండో సారి యూపీ సీఎంగా యోగీ ప్రమాణం

-

రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యోగీ ఆదిత్య నాథ్. యోగీలో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ యోగీతో ప్రమాణ స్వీకారం చేయించారు.  యోగీ క్యాబినెట్ లో 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ లు ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. నయా భారత్ కా నయా యూపీ పేరుతో స్టేడియంలో వేదిక ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. దాదాపుగా 37 ఏళ్ల తరువాత వరసగా ఓ పార్టీ వరసగా అధికారాన్ని యూపీలో చేజిక్కించుకుంది. 

ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలైన వారు హాజరయ్యారు. వీరితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హిమంత బిశ్వశర్మ, మనోహర్ లాల్ కట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్మానించారు.

Read more RELATED
Recommended to you

Latest news