మాఫియా, గుండాలకు చట్టం అంటే ఏమిటో తెలిసేలా చేసింది యోగీ సర్కార్- ప్రధాని నరేంద్ర మోదీ

-

యూపీలో మాఫియా, గుండాలకు చట్టం అంటే ఏమిటో తెలిసేలా యోగీ సర్కార్ చేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. యోగి ప్రభుత్వం గత ఐదేళ్లలో యూపీని ‘మాఫియా పాలన’ నుంచి బయటకు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. చట్టానికి అతీతంగా భావించే గుండాలకు యోగీ సర్కార్ చట్టం అంటే ఏమిటో నేర్పించిందని.. మళ్లీ వాళ్లు అధికారంలోకి రావాలని చూస్తుందని మోదీ అన్నారు. ఐదేళ్ల క్రితం యూపీలో వలసలకు సంబంధించిన వార్తలు చూసేవాళ్లమని, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని.. అలాంటిది ఇప్పుడు యోగీ ప్రభుత్వం ప్రజల్ని అటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చిందని అన్నారు. పేదలు, దళితులు, వెనుకబడినవారు మరియు అణగారిన వర్గాల ఇళ్లు, భూములు మరియు దుకాణాలను అక్రమంగా ఆక్రమించడం ఐదేళ్ల క్రితం సోషలిజానికి సంకేతంగా ఉండేదని ఎద్దేవా చేశారు. పశ్చిమ యుపి ప్రజలు ఈ ప్రాంతంలో అల్లర్లలో కాలిపోతున్నప్పుడు, అప్పటి ప్రభుత్వం సంబరాలు చేసుకున్న విషయాన్ని ఎప్పటికీ మరచిపోరని గుర్తు చేశారు. బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందని.. కానీ విపక్షాలు ప్రజలపై పగ తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్నాయని విమర్శించారు.

2017కు ముందు బులంద్ షహర్, మీరట్ జిల్లాలో అమ్మాయిలు బయటకి వెళ్లే పరిస్థితి ఉండకపోయేదని.. వ్యాపారులు భయపడాల్సి వచ్చేదని అలాంటి డబుల్ ఇంజన్ సర్కార్ పరిస్థితులను చక్కపెట్టిందని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news