తీవ్ర అస్వస్థత…ఆసుప‌త్రిలో చేరిన వీహెచ్‌

మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్‌ నాయకులు వి హనుమంత రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వి. హనుమంతరావు హైదరాబాద్‌ లోని ప్రముఖ అపోలో ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే హనుమంతరావు చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

v hanumanth rao and his wife victory over corona virus

అటు వి.హనుమంతరావు ఆరోగ్య విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందారు. వీ హెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి‌ని ఏఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ రాశారు.