వారెవ్వా.. కేసీఆర్ పై రాహుల్ స్కెచ్ సూపర్.. కానీ.. అట్టర్ ఫ్లాప్ అయింది..!

-

కేసీఆర్ పై రాహుల్ స్కేచ్ వేశాడా? ఏం స్కేచ్. అని కంగారు పడిపోకండి. రాహుల్ స్కెచ్ డైరెక్ట్ గా ఉండదు కదా. అందుకే ప్రతాప్ రెడ్డిని, హరీశ్ రావును తన ప్లాన్ లో బాగంగా వాడుకున్నాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ షో అయింది. అడ్డం తిరిగింది. మొదటికే మోసం వచ్చింది. తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేవు ఆ ఆరోపణలు. ఇంతకీ రాహుల్ స్కెచ్ ఏంటి. మంత్రి హరీశ్ రావును ఈ స్కెచ్ లో ఎలా లాగాడు.. గజ్వేల్ మహా కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిని ఎలా పావులా వాడుకున్నాడో విశ్లేషిద్దాం పదండి.

అసలు ఏం జరిగింది… వంటేరు ప్రతాప్ రెడ్డి .. మంత్రి హరీశ్ రావుపై కొన్ని ఆరోపణలు చేశాడు. ఏమనీ అంటే.. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించాలంటూ మంత్రి హరీశ్ రావు తనకు ఫోన్ చేశాడు అన్నాడు. ఆర్థిక సాయం చేయడానికి కూడా హరీశ్ రావు రెడీగా ఉన్నాడన్నాడు. తనను రాజకీయంగా కేసీఆర్ ఎదగనీయడం లేదని.. కేటీఆర్ కే పట్టం కడుతున్నాడని హరీశ్ ఆవేదన చెందాడని ఓ మీటింగ్ లో వంటేరు చెప్పాడు. ఏకంగా రాహుల్ తోనే హరీశ్ రావు టచ్ లో ఉన్నాడని.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా హరీశ్ రావు వెనుకాడబోడని వంటేరు అన్నాడు.

అయితే.. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే… నిజంగానే హరీశ్ రావు రాహుల్ తో టచ్ లో ఉన్నాడనుకుందాం. అప్పుడు అది సీక్రెట్ ఆపరేషన్ అవుతుంది కదా. ఆ విషయాన్ని కావాలనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బహిర్గతం చేసుకుంటుంది. అలా చేసుకుంటే వాళ్లకు వచ్చే లాభం ఏముంటుంది. ఏం ఫైదా ఉంటది. ముందే అన్ని తెలిస్తే కేసీఆర్ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇదేదీ నమ్మబుల్ గా లేదు.

హరీశ్ రావును కొద్ది రోజులుగా కేసీఆర్ పక్కన పెడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అవి నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే.. దాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి అనేది మాత్రం దీని ద్వారా స్పష్టమౌతోంది. అందుకే.. రాహుల్ కు, ప్రతాప్ రెడ్డికి, హరీశ్ కు లింక్ పెట్టి టీఆర్ఎస్ పార్టీకి జనాల్లో నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్లాన్ అయి ఉండొచ్చు ఇది. ఇది రాహులే చేయించి ఉండొచ్చు.. లేదంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే చేయించి ఉండొచ్చు.. లేదంటే ఏపీ సీఎం బాబు అయినా చేయించి ఉండొచ్చు. ఎందుకంటే.. బాబు మొన్ననే కదా రాహుల్ గాంధీని కూడా కలిసి వచ్చాడు. అప్పుడు మాట్లాడుకున్నారో ఏమో.. కేసీఆర్ ను, హరీశ్ రావును ఇలా బదనాం చేసి చేతులు దులుపుకుందామనుకున్నారేమో. అందుకే వంటేరుతో అలా చెప్పించారేమో?

సరే.. రాహుల్ తో హరీశ్ రావు టచ్ లో ఉన్నాడనుకుందాం.. అసలు కాంగ్రెస్ లో ఏమున్నది ఇప్పుడు పోవడానికి. అందులో అంతా సీఎం అభ్యర్థులే కదా. జానారెడ్డి దగ్గర నుంచి.. మొన్ననే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కూడా సీఎం క్యాండిడేటే. ఇప్పుడు కొత్తగా హరీశ్ రావు పోయి మరో సీఎం క్యాండిడేట్ కావాలా? టీఆర్ఎస్ లో ఎలాగూ మూడో స్థానం ఆయనదే. అవునన్నా… కాదన్నా… కేసీఆర్, కేటీఆర్ తర్వాత హరీశ్ రావే. మరి.. ముచ్చటగా ఉన్న మూడో స్థానాన్ని వదులుకొని ఎందుకు ఆ కలగూరగంపలో దూరాలనుకుంటాడు హరీశ్ రావు. అనుకునే చాన్సేలేదు.

ఒకవేళ నిజంగానే హరీశ్ రావుకు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తున్నా… తనను పట్టించుకోకున్నా… రాజకీయాల నుంచి తప్పుకుంటాడు తప్పితే మరో పార్టీలో చేరడు. ఇది ఫిక్స్. చాలా సార్లు.. చాలా ఇంటర్వ్యూలలో హరీశ్ రావు కూడా ఇదే మాటను చెప్పాడు. అంటే.. రాహుల్ తో హరీశ్ రావు టచ్ లో ఉన్నాడనేది అబద్ధమే అయితే. దాంతో పాటు కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించాలనేది అబద్ధమే అయ ఉండొచ్చు. ఎందుకంటే.. కేసీఆర్ గజ్వేల్ లో ఓడిపోతే ఏమైతది. ఏం కాదు. ఒక సీటు పోతది తప్పితే ప్రభుత్వమైతే పడిపోదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి గజ్వేల్ స్థానమే అడ్డంకి కాదు కదా. ఒక్క సీటుతో పోయేదేమీ లేదు. అంటే నిజంగానే హరీశ్ రావు నాతో టచ్ లో ఉన్నాడు. నాకు ఫోన్ చేశాడు.. కేసీఆర్ ను ఓడించమన్నాడు.. అంటూ వంటేరు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే అన్నమాట.

ఇది కేవలం సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీయో లేక చంద్రబాబో లేక కోదండరామో…రాహులో… లేదా మహా కూటమంతా కలిసి వేసిన ప్లానో తెలియట్లేదు కానీ.. పక్కా స్క్రిప్టెడ్ ప్లాన్ ఇది. కావాలనే హరీశ్ రావుతో కేసీఆర్ కు విభేదాలు సృష్టించాలని వేసిన ప్లాన్ ఇది అని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. ఎన్నికలకు ఇంకా నెలరోజులే సమయం ఉండటంతో క్షేత్రస్థాయిలోనూ టీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలని ఆడిన గేమ్ అని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అందుకే.. ఈ గేమ్ అట్టర్ ఫ్లాప్ షో అయింది. ఇంత పెద్ద స్కెచ్ వేసి హరీశ్ రావు, కేసీఆర్ ను బ్లేమ్ చేసినా… తెలంగాణ ప్రజలు అస్సలు నమ్మట్లేరు అంటూ కాంగ్రెస్ నాయకులు తమలో తాము ఈర్ష్య పడుతుండొచ్చు. ఇంకో బెటర్ ప్లాన్ చూసుకోండి బాబులూ. ఇది ఎలాగూ వర్కవుట్ కాలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్…

Read more RELATED
Recommended to you

Latest news