సీఎం కేసీఆర్ పాలన కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా చులకనగా చూసే దుస్థితి నెలకొందని మాజీ ఎంపీ విజయశాంతి ట్విటర్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ‘సీఎం కేసీఆర్ ఎన్నికలు, ఉద్యమ సమయంలోనూ ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్ల లాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాట నమ్మిన రైతులు సన్న వడ్లు పండించి మద్ధతు ధర దక్కకపోవడంతో ఇతర రాష్ట్రాలకు తమ పంటలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసి ఉద్యోగాల ప్రకటన వెలువడకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడ్డారని దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు.
ఉత్తుత్తి హామీలే..
పలు పాజెక్ట్‌ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలోనూ కేసీఆర్ సర్కారు విఫలమైంది. ఉద్యమ సమయంలో నుంచి అ«ధికారంలోకి వచ్చినప్పుటి వరకు చెబుతున్న ‘మా నీళ్లు మాకు.. మా ఉద్యోగాలు మాకు’ అనే నినాదం, ఏమైందని ప్రశ్నించారు. డబూల్ బెడ్రూమ్‌లు, దళితులకు మూడెకరాల భూమి, ఇటీవల అందించిన వరదసాయం అన్నింటిలోనూ విఫలమయ్యారన్నారు.తాజాగా భూసంస్కరణలంటూ ప్రారంభించిన ధరణి వెబ్‌సైట్ గందరగోళం సృష్టించిందన్నారు.సీఎం కేసీఆర్ కురిపిస్తున్న హామీల వర్షం కేవలం ఓట్లకోసం వేస్తున్న గాలలేనని విజయశాంతి ధ్వజమెత్తారు.