ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణపై కేంద్రంతో చ‌ర్చిస్తాం : బండి సంజ‌య్

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పై మంద కృష్ణ మాదిగ విజ‌యం సాధిస్తార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి అమిత్ షా దృష్తికి
తీసుకెళ్తామ‌ని అన్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ స‌మ‌స్య‌ను ప‌రిష్కరించేందుకు తాము కృషి చేస్తామ‌ని బండి సంజ‌య్ అన్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కు బంగారు లక్ష్మణ్ నుంచి ఉప రాష్ట్ర ప‌తి వెంకయ్యనాయుడు తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మీ ఉద్యమానికి మద్దతు తెలిపారని అన్నారు.

నిరుపేదలకు సంక్షేమ ఫలాలు దక్కాలని అన్నారు. దాని కోసం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని అన్నారు. ఎస్సీల‌కు గ‌తం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. మంద కృష్ణ మాదిగ ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని ఉద్యమాల్లో విజయం సాధించారని అన్నారు. అలాగే ఎస్సీ వర్గీక‌ర‌ణ ఉద్య‌మంలో కూడా విజ‌యం సాధిస్తార‌ని అన్నారు. బిజెపికి ఎస్సీల‌పై విశ్వాసం ఉందని అన్నారు. ఎస్సీ వ‌ర్గీకర‌ణ స‌మ‌స్య‌ను త‌ప్ప కుండా తీరుస్తుంద‌ని అన్నారు.