త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ… కీలక ఎత్తుగడ వేసింది. బెంగాల్ లో రాబోయే ఉపఎన్నికల్లో మాజీ బీజేపీ లీడర్లను బరిలోకి దింపబోతోంది. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో 4 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి షెడ్యూల్ ప్రకటించింది. దీంట్లో రెండు స్థానాలు పశ్చిమ బెంగాల్ లోనే ఉన్నాయి. అసన్ సోల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు బల్లి గంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 17న గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుండగా.. 24 వరకు నామినేషన్ల స్వీకరణ, ఎప్రిల్ 12 ఎన్నికలు, ఎప్రిల్ 16న కౌంటింగ్ ఉండనుంది.
ఈ క్రమంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రెండు స్థానాలకు పేర్లను ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రులు, మాజీ బీజేపీ నాయకులైన ఫేమస్ యాక్టర్ శత్రఘ్ను సిన్హాను అసన్ సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరో మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోను బల్లిగంజ్ నుంచి అసెంబ్లీ బరిలోకి దించుతున్నట్లుగా దీదీ ప్రకటించింది. దీంతో బీజేపీపై పక్కా వ్యూహంతో మమతా బెనర్జీ వెళ్తున్నారు.