కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా!

-

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సరే కేసీఆర్ కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు…రెండుసార్లు అధికారంలోకి వస్తే సాధారణంగానే వ్యతిరేకత వస్తుంది…కానీ ఆ వ్యతిరేకత కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది..అయినా సరే మూడో సారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని కేసీఆర్ చెప్పేస్తున్నారు. ఏ మాత్రం డౌట్ లేకుండా 95-105 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని అంటున్నారు. పైగా ఓ సర్వే తమకే అనుకూలంగా ఉందని అంటున్నారు.

అలాగే ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని,  గతంలో తాను అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోయిన మాట నిజమేనని, ఇప్పుడా అవసరమే లేదని చెప్పారు. అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లతో గెలుస్తామని, తాజాగానే  ఒక సర్వే వివరాలు వచ్చాయని,  30 సీట్లకు సర్వే చేస్తే 29 తామే గెలుస్తున్నట్టు వచ్చిందని,  ఆ ఒక్క సీటు కూడా 0.3 శాతం తేడాతో వేరే పార్టీకి వెళుతోందని అని చెప్పారు.

అంటే మొత్తం మీద టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు…అయితే ఇంత కాన్ఫిడెన్స్ గా కేసీఆర్ చెప్పడానికి కారణం ఏంటి? ఆ కాన్ఫిడెన్స్ వెనుక కారణం ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యాకే కేసీఆర్ లో కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలుస్తోంది. ఆయన ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టి…టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు.

ఇక పీకే వ్యూహాల్లో భాగంగానే కేసీఆర్ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది…అందుకే కేవలం బీజేపీనే టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు…ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాలో బీజేపీ గెలిచింది…అయినా సరే బీజేపీ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడం లేదు. బీజేపీపై యుద్ధం ఆపడం లేదు..కేంద్రంలో బీజేపీని గద్దె దించడానికి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఖాయమని మాత్రం చెబుతున్నారు. అంటే కేసీఆర్ ఇంత కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లడానికి పీకే వ్యూహలే కారణమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news