బండి సంజయ్ అసలు పనిచేయకుండా…ఈ హడావిడి ఏంది?

బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా? లేక ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద కన్ఫ్యూజన్ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కే‌సి‌ఆర్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టి బి‌జే‌పిని పైకి లేపాలని చెప్పి బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం నుంచి సక్సెస్‌ఫుల్‌గా పాదయాత్ర స్టార్ట్ చేశారు. అలాగే కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

bandi-sanjay
bandi-sanjay

అయితే రాను రాను బండి పాదయాత్ర కాస్త ఎన్నికల ప్రచారంగా మారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశంలో బడా బడా బి‌జే‌పి నాయకులంతా బండి పాదయాత్రలో పాల్గొంటున్నారు. వరుస పెట్టి కేంద్ర మంత్రులు సైతం బండికి మద్ధతుగా వస్తున్నారు. కాకపోతే వారు రావడంతో పాదయాత్ర కాస్త ఎన్నికల ప్రచారంగా అయిపోతుంది. వారు రావడం కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని తిట్టడమే చేస్తున్నారు గానీ, అసలు బి‌జే‌పిని ఇంకా ఎలా బలోపేతం చేయాలనే ఆలోచనలు మాత్రం చేస్తున్నట్లు కనిపించడం లేదు.

బండి నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై, స్థానికంగా ఉండే టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. కానీ ఆయా నియోజకవర్గాల్లో బి‌జే‌పిని బలోపేతం చేసే ఆలోచన చేయడం లేదు. పైగా ఆయా నియోజకవర్గాల్లో బి‌జే‌పి బరిలో దిగే అభ్యర్ధుల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఎన్నికలు ఇప్పుడే కాదని, బండి లైట్ తీసుకుంటే బి‌జే‌పికే ఇబ్బంది అవుతుంది.

 ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటిస్తే అప్పుడు వారు పికప్ అవ్వడానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటినుంచే అన్నీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని పూర్తి స్థాయిలో పెట్టేయాలి. ఇక వారినే ఎన్నికల్లో పోటీ చేయించడానికి ప్రిపేర్ చేయాలి. అలా కాకుండా ఏదో పాదయాత్ర చేశాం…కే‌సి‌ఆర్‌ని తిట్టాం…ఇతర రాష్ట్రాల నుంచి బి‌జే‌పి పెద్దలని తీసుకొచ్చి హడావిడి చేశామనుకుంటే సరిపోదు. ఇప్పటికైనా బండి నియోజకవర్గాల వారీగా పార్టీపై దృష్టి పెట్టకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.