ట్రంప్ ని చూసి ఇండియా ఏం నేర్చుకోవాలి ??

-

అగ్రరాజ్యం అమెరికా దేశం కరోనా వైరస్ వల్ల చాలా దెబ్బతింది. ఆర్థిక విషయంలోనూ మరియు ప్రాణనష్టం విషయంలోనూ అమెరికా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారీ మూల్యం చెల్లించు కుంది. దీనంతటికి కారణం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ వ్యాధి విజృంభించిన తరుణంలో చాలా వరకు ప్రపంచ దేశాలు అన్ని లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ అమెరికా మాత్రం యధావిధిగా కార్య కలాపాలు సాగించింది. ఈ సందర్భంలో అమెరికా దేశానికి చెందిన ఆరోగ్యశాఖ, జాతీయ దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు ఈ మహమ్మారి వైరస్ గురించి హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్ పట్టించుకోలేదు. ఫలితం ప్రస్తుతం లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో తీవ్రస్థాయిలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంది.Why PM Modi should have corrected President Trump when he said ...ఇటీవల తేరుకున్న డోనాల్డ్ ట్రంప్ దేశంలోని 50 రాష్ట్రాలకు గాను 32 రాష్ట్రాలో పూర్తి లాక్ డన్ ప్రకటించడం జరిగింది. చాలా వరకు అమెరికా పరిస్థితి ఈ విధంగా మారటానికి ట్రంపు ఏకపక్ష ధోరణి అని విపక్షాలు అదే విధంగా అమెరికా మీడియా గగ్గోలు పెడుతోంది. మరోపక్క డోనాల్డ్ ట్రంప్ చాలా వరకు నష్టం వాటిల్లిన తర్వాత తన తప్పును వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై మరియు మీడియా పై నెట్టేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ సంవత్సరంలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని టాక్. ఇటువంటి టైం లో ఇండియాలో కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మేధావుల దగ్గర సలహాలు తీసుకుని వ్యవహరించాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు.

 

అమెరికా దేశం అతి పెద్ద భూభాగం మరియు అతి తక్కువ జనాభా కలిగిన కంట్రీ అయినా గాని కొద్ది పాటి నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. భారతదేశంలో అతి తక్కువ భూభాగంపై ఎక్కువ జనాభా కలిగిన దేశం..ఇటువంటి సందర్భంలో కేంద్రంలో ఉన్న పెద్దలు డోనాల్డ్ ట్రంప్ మాదిరిగా వ్యవహరించ కూడదని….అమెరికాలో పరిస్థితి ఇక్కడ ఎదురైతే కనుక జనాలు పిట్టలు రాలినట్టు రాలటం గ్యారెంటీ అని అంటున్నారు. అంతే కాకుండా ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ చనిపోయే దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news