అసలు జగన్ వ్యూహం ఏంటి…? బాబు 40 ఏళ్ళ అనుభవానికి పరీక్ష…?

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ఏంటి…? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో ఏ స్పష్టతా రావడం లేదు. రాజకీయంగా బలపడే అవకాశం ఇదని భావించిన తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. రాజధానిని అమరావతి ప్రాంతం నుంచి తరలించకుండా చూడాలని చంద్రబాబు భావించారు. కాని జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం కనపడటం లేదు.

దీనితో ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నేతలకు చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళను ఏ విధంగా బుజ్జగించాలో చంద్రబాబుకి అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. కమిటీల రిపోర్ట్ లు జగన్ వ్యాఖ్యలతో తెలుగుదేశం నేతలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జేఎన్ రావు కమిటి చెప్పిందే, బోస్టన్ కమిటి కూడా చెప్పడంతో,

రాజధాని అనేది తరలిస్తే రాజకీయంగా నష్టపోతాం అనే భయం తెలుగుదేశం నేతల్లో ఉంది. ఇక చంద్రబాబుని నమ్ముకుని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీగా భూములు కొన్నారు తెలుగుదేశం నేతలు. ఆ భూముల ధరలు ఇప్పటికే భారీగా పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. రాజధాని ఉద్యమం కేవలం అమరావతి ప్రాంతంలోనే జరగడం కూడా తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news