వాట్సాప్ వైరల్ : జగన్ అండ్ బ్యాచ్ నేరాల చిట్టా ??

-

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ రాజకీయ నాయకుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీ లీడర్లను భయపెడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రతి పొలిటికల్ లీడర్ తన పార్టీకి సంబంధించి పార్టీ వెబ్ సైట్ లో సోషల్ మీడియాలో తప్పనిసరిగా తమపై ఉన్న నేర చరిత్ర కలిగిన వివరాలను పొందుపరచాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. Image result for jagan cases

దీంతో సుప్రీం ఆదేశాల మేరకు చాలా పార్టీ లీడర్లు తమకు సంబంధించిన నేరచరిత్ర కలిగిన కేసుల వివరాలను వెబ్ సైట్ లో పెట్టడానికి లిస్టు తయారు చేసుకుంటున్నారు. దీనివల్ల ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలు పొందుపరిచిన సందర్భంలో కేసులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ ఎన్నికల కమిషన్ డేట్ అటాచ్ మెంట్ చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు ఆయన బ్యాచ్ నేరాల చరిత్ర చిట్టా మొత్తం ఓ మీడియా సంస్థ సేకరించినట్లు వార్త వాట్సాప్ లో వైరల్ అవుతుంది.

 

జగన్ పై దాదాపు 38 కేసులు ఉన్నట్టు ఆ వీడియోలో తేలింది. ఆ తరువాత వైసీపీ పార్టీ నేతల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి, మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, కొడాలి నాని, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పశ్రీ వాణి ఇలా చాలామందిపై కేసులు ఉన్నట్టుగా వీడియో లో అసలు విషయం బయటపడింది. 

Read more RELATED
Recommended to you

Latest news