ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మధ్య అధికార దాహం! రా ష్ట్రంలో శాసన మండలిని రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని అంగీకరించినట్టయితే.. కేంద్రం ఓ బిల్లును తయారు చేసి పార్లమెంటులో పెట్టి.. ఉభయ సభ ల్లోనూ ఆమోదించుకుని రాష్ట్రపతికి పంపి.. ఆమోద ముద్ర వేస్తే.. అప్పుడు ఏపీ శాసన మండలి రద్దవుతుం ది. దీంతో జగన్ కేబినెట్‌లోని రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. అయితే, పైన చెప్పుకొన్నదంతా జరిగి.. మండలి రద్దు అయ్యేందుకు చాలా సమయం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు శాసన మండలి విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకో వాలి? అనేదానిపై పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. పైగా ఇప్పుడున్న పార్లమెంటు సమావేశాల్లో అధి కార పార్టీ అనేకతల నొప్పులు ఎదుర్కొంటోంది. దీంతో ఏపీ పంపిన శాసన మండలి రద్దు తీర్మానంపై బిల్లు ను ప్రవేశ పెట్టే సాహసం చేయదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక, లోక్‌సభలో బీజేపీకి బలం ఉంది కాబట్టి.. ఈ బిల్లును పాస్ చేయించుకున్నా.. రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్‌దే ఎక్కువగా బలం ఉంది. సో.. అక్కడ డింకీ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. మండలి రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది కాబట్టి!
సో.. ఈ ప్రక్రియ జరిగేందుకు ఇంత ప్రక్రియ ఉంది. అయినా కూడా.. మంత్రి వర్గంలో సీట్లపై ఆశలు పెట్టు కున్న వారు.. మాత్రం ఇప్పటి నుంచి తమ పవర్ చూపిస్తున్నారట. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన నగరి ఎమ్మెల్యే రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు ఇద్దరూ మంత్రి పదవులు ఆశించారు. వీరిలో ఆళ్లకు జగనే స్వయంగా మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. దీంతో ఇద్దరూ కూడా మంత్రి పదవిపై ఈ ఇద్దరూ కూడా భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.
కానీ, సామాజిక వర్గాల సమీకరణలో వీరికి ఛాన్స్ మిస్సయింది. కానీ, ఇప్పుడు ఖాళీ కాబోతున్న రెండు సీట్లలో(ఒకటి మోపిదేవి వెంకటరమణ, రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్) ఒకటైనా తమకు దక్కదా? అని ఇద్దరూ పోటీ పడుతున్నారట. ఈ క్రమంలో జగన్ ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో చూడాలి. ఇక, ఇప్పటికే రోజాకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా కీలక పదవి ఉండడంతో ఆళ్లకు ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.