తెలంగాణ రెండో ముఖ్యమంత్రి కూడా కేసీఆరేనా..?… ఇంకా నెల రోజుల్లో తేలిపోనుంది…!

-

Who will be the telangana next cm?
అస్సలు ఎవ్వరూ ఊహించని పరిణామం ఇది. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికలు వస్తాయని బహుశా కేసీఆర్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ.. తెలంగాణలోని రాజకీయ పరిణామాలు ఆయన్ను ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా చేశాయి. అంతా.. లోక్ సభతో పాటే వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ సమయంలో ఉంటాయి కదా అని అనుకున్నారు. కానీ.. ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరుగుతాయని ఏ తెలంగాణ పౌరుడు కూడా కల కని ఉండకపోవచ్చు.

అయితే.. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చాయి.. ఎలా వచ్చాయి.. అనే దానిపై కాదు చర్చించాల్సింది. సరిగ్గా నెలరోజుల్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది. అది ఇక్కడ పాయింట్. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గత ప్రభుత్వాలతో పోల్చిన కాస్త బెటరే. కాస్తేమిటి చాలా బెటర్. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఆ విషయంలో సీఎం కేసీఆర్ గ్రేట్. కేవలం నాలుగంటే నాలుగేళ్లలోనే తెలంగాణలోని ప్రతి వర్గం అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. అది నిజంగా గర్వించదగ్గ విషయం.

నిజానికి తెలంగాణలో ప్రవేశపెడుతున్న ఏ పథకమయినా.. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రమూ ప్రవేశపెట్టలేదు. దేనికదే ప్రత్యేకత చాటుకున్నది. ఆ పథకాలను చూసి కేంద్రం, ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయి. రైతుల కోసం కావచ్చు.. ఇంకా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కావచ్చు.. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు యూనిక్. అవి ఇప్పటి వరకు ఎవరూ ప్రవేశపెట్టలేదు. ఆయన పథకాల ద్వారా తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. తెలంగాణకు పెట్టుబడులు కూడా విపరీతంగా వస్తున్నాయి. రియల్ ఏస్టేట్ రంగం పుంజుకుంది. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి.. కేవలం నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన వినూత్న పథకాల వల్ల. వినూత్న ఆలోచనల వల్ల. వినూత్న ఆచరణ వల్ల. తెలంగాణకు ఏదైనా చేయాలనే కసి, పట్టుదలే ఆయన్ను ఇవన్నీ చేసేలా చేసింది.

ఇప్పుడు కేసీఆర్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. తెలంగాణకు కాబోయే రెండో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారా? కాదా? అదే ఇప్పుడు పేద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత సీఎంల కన్నా కేసీఆర్ వంద రెట్లు నయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా.. తెలంగాణ ప్రజలు ఆయన్ను మళ్లీ సీఎంగా గెలిపిస్తారా? లేక… తెలంగాణలో అధికారం కోసమే పొత్తులు పెట్టుకొని… టీఆర్ఎస్ యేతర కూటమిగా ఆవిర్భవించిన మహాకూటమి గెలుస్తుందా? మహాకూటమి గెలిచే అవకాశాలు మాత్రం చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు కేవలం తెలంగాణలో అధికారం కోసం బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు. దీంతో తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్, టీడీపీపై విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా శుద్ధపూస ఏం కాదు కదా. దశాబ్దాల పాటు తెలంగాణను పాలించి చివరకు తెలంగాణను అభివృద్ధికి ఆమడ దూరం ఉండేలా చేసింది. తెలంగాణను దోచుకుతిన్నది. కాబట్టి కేవలం అధికారం కోసం పొత్తు పెట్టుకొని తెలంగాణ జనాలను మభ్యపెట్టే హామీలను గుమ్మరిస్తున్న మాయ కూటమిని క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారు. మాయ కూటమి మోసాన్ని ముందే గుర్తించారు. అందుకే… ప్రస్తుతం తెలంగాణకు నిజంగా న్యాయం చేయగలిగే వ్యక్తి ఒక్క కేసీఆరే అని సగానికి పైగా జనాలు నమ్ముతున్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ తెలంగాణలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ గడ్డపై మళ్లీ గులాబీ జెండానే ఎగిరే అవకాశం ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news