తప్పు జగన్‌దా.. కే‌సీఆర్‌దా.. ??

-

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చాలా కట్టుదిట్టంగా పాటిస్తున్నారు. చాలా వరకు రాష్ట్రాల సరిహద్దులు మూసేశారు. దేశ వ్యాప్తంగా రవాణా కూడా స్తంభించిపోయింది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలు లేవు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులు కూడా క్లోజ్ చేయడం జరిగింది. గ్రామాల్లో కూడా ప్రజలు ఎవరూ కొత్త వారిని తమ గ్రామాల్లో కి రానీయడం లేదు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల వద్ద వేల మంది హైదరాబాదులో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇరుక్కు పోయారు. చాలా జనాలు గుంపులుగుంపులుగా ఉండిపోయారు. Image result for kcr ys jaganవాళ్లలో ఎక్కువగా హాస్టల్లో ఉండే విద్యార్థులు ఉన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు అమీర్ పేట ప్రాంతంలో ఉన్న హాస్టల్ లో విద్యార్థులందరినీ ఖాళీ చేయించాలని అధికారులు యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సరిహద్దులు అన్నిటిని క్లోజ్ చేసిన సందర్భంలో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం మొత్తానికి కొంపముంచింది. బయల్దేరిన విద్యార్థులంతా తెలంగాణ ఏపీ బోర్డర్ వద్ద రాష్ట్రంలో కి వెళ్లలేక పోలీసుల ద్వారా ఆగిపోవాల్సి వచ్చింది.

 

ఎవరిని రాష్ట్రంలోకి పోలీసులు రానీయకుండా ఉండటంతో అటూ ఇటూ కాకుండా ఇరుక్కుపోయారు. దాదాపు ఏడు గంటలపాటు అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై బండ బూతులు తిట్టారు. తప్పు జగన్ దా కే‌సి‌ఆర్ దా ?? అంటూ నిలదీశారు. ఇంకెందుకు లాక్‌డౌన్…వాళ్ళలో కొంతమంది చాలు రాష్ట్రం మొత్తం నాశనం చేయడానికి…అంటూ సీరియస్ అయ్యారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తప్పు ఏమాత్రం లేదు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు…ఏమాత్రం ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని ఏపీ ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు . 

 

Read more RELATED
Recommended to you

Latest news