కొడాలి ఎటాకింగ్ తగ్గిందా? గుడివాడలో ఏం జరుగుతోంది?

-

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నానిలో ఫైర్ తగ్గిందా? ఇటీవల ఆయన ఎందుకు దూకుడుగా లేరు. ఓ వైపు పవన్ వారాహి యాత్ర చేస్తూ..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అటు లోకేష్ పాదయాత్ర చేస్తూ..జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఇటు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పర్యటన అంటూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్న కొడాలి ఎందుకు పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు.

ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకు దూకుడుగా మాట్లాడటం లేదనే డౌట్లు విశ్లేషకులు వస్తున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి తాజాగా చిరంజీవి..జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు. ప్రతి పకోడీ గాడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే అని ఫైర్ అయ్యారు. అటు చంద్రబాబు ఇటీవల పుంగనూరు పర్యటన, దాడులపై కూడా స్పందించారు. అయితే మునుపటి మాదిరిగా కొడాలి దూకుడుగా బాబుపై విమర్శలు చేయడంలో కాస్త వెనకబడ్డారు. అయినా ఇన్ని రోజులు ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది తెలియడం లేదు.

ఆ మధ్య ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వాటిల్లో నిజమెంత ఉందో ఎవరికి తెలియదు. దాని వల్లే కొడాలి సైలెంట్ అయ్యారా? అంటే ఏమో చెప్పలేం. సరే ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఇదే ఊపు కొనసాగిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడతారా? మళ్ళీ సైలెంట్ అవుతారా? అనేది క్లారిటీ రావడం లేదు.

మామూలుగా జగన్‌ని ఒక్క మాట అంటే కొడాలి ఊరుకోరు. అలాంటిది కొన్ని రోజుల నుంచి ఆయన గ్యాప్ తీసుకున్నారు. మరి ఇకనుంచైనా దూకుడుగా ఉంటారేమో చూడాలి. ఇక గుడివాడలో కొడాలిపై ప్రత్యర్ధిగా టి‌డి‌పి నుంచి వెనిగండ్ల రాముని నిలబడతారని టాక్. కానీ ఎవరు నిలబడిన గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం అసాధ్యం.

Read more RELATED
Recommended to you

Latest news