ముద్దు పెట్టుకోవాలంటూ బస్సులో యువతులపై ఒత్తిడి.. తర్వాత పిడిగుద్దుల వర్షం

ఇద్దరు యువతులు మెలనియా, ఖ్రిస్.. ఇద్దరూ లండన్‌లో డబుల్ డెక్కర్ బస్సు ఎక్కారు. బస్సులో పై అంతస్తులో కూర్చున్నారు. వీళ్లను గమనించిన ఐదుగురు అబ్బాయిలు వాళ్లను చుట్టుముట్టి వేధించి.. ముద్దు పెట్టుకోవాలంటూ రచ్చ రచ్చ చేసి చివరకు వాళ్లపై దాడికి తెగబడ్డారు.

మాకు ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి.. మీరిద్దరూ ముద్దు పెట్టుకోండి. మాకు చూడాలని ఉంది. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి.. అంటూ కొందరు అబ్బాయిలు ఇద్దరు స్వలింగ సంపర్కులైన యువతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే.. అందరి ముందూ తాము ముద్దు పెట్టుకోమని ఆ యువతులు తెగేసి చెప్పారు.

దీంతో ఐదుగురు అబ్బాయిలు.. ఇద్దరు యువతులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. వాళ్ల ముఖంపై దాడి చేయడంతో వాళ్లకు గాయాలయ్యాయి. ఒక యువతి ముక్కు కూడా విరిగిపోయింది. ఈ ఘటన లండన్‌లో ఓ బస్సులో చోటు చేసుకున్నది. యువతులపై దాడి చేసిన వాళ్లంతా 16 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న అబ్బాయిలే.

ఇద్దరు యువతులు మెలనియా, ఖ్రిస్.. ఇద్దరూ లండన్‌లో డబుల్ డెక్కర్ బస్సు ఎక్కారు. బస్సులో పై అంతస్తులో కూర్చున్నారు. వీళ్లను గమనించిన ఐదుగురు అబ్బాయిలు వాళ్లను చుట్టుముట్టి వేధించి.. ముద్దు పెట్టుకోవాలంటూ రచ్చ రచ్చ చేసి చివరకు వాళ్లపై దాడికి తెగబడ్డారు. యువతులపై దాడికి పాల్పడిన అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.