హఫీజ్ పేట భూ వ్యవహరంలో ఆ మంత్రి,ఎంపీల స్పీడు ఎందుకో

హఫీజ్ పేట భూ వ్యవహరం కిడ్నాప్ జరిగిన తర్వాత ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు భాదిత కుటుంబ సభ్యులను కలవడం ఇప్పుడు చర్చనీయశంగా మారింది .ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులకు బాధిత కుటుంబ సభ్యులు ఎందుకు సమాచారం ఇచ్చారు.ఆ ఎంపీ,మంత్రి గారు రంగలోకి దిగి పోలీసులకు ఉరుకులు పరుగులు ఎందుకు పెట్టించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హఫీజ్ పేట భూ వ్యవహరంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హట్ టాపిక్ గా మారాయి . భూ వ్యహరంలో కిడ్నాప్ ,ఆ తర్వాత మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ అరెస్టు సంచలనం అయ్యింది .ఇక కిడ్నప్ తర్వాత ఇద్దరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు..ఈ వ్యవహరంలో భాదితులు పక్షాన నిలబడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయశంగా మారింది .మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,ఎంపి మలోవత్ కవితలు ఈ వ్యవహరంలో కనిపించడం ఇప్పుడు హట్ టాపిక్ అయ్యింది .ఈ ఇద్దరికి..ఆ కుటుంబంతో ఉన్న సంబందాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది .

ఇటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కిడ్నప్ వ్యవహరంను ఎంపి మలోవత్ కవిత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది .మలోత్ కవితకు సన్నిహితురాలు..బాధిత కుటుంబ సభ్యులు ఒకే సామాజిక వర్గంకు చెందిన వారుగా తెలుస్తోంది. దీంతో మహబుబాబాద్ ఎంపి కవిత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది .గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కవిత ..ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు .2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబుబాబాద్ లోకసభ నియెజకవర్గంకు నుంచి పోటి చేసి లోకసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు .

హఫీజ్ పేట భూ వ్యవహరంలో బాధిత కుటుంబ సభ్యుడు ,న్యాయవాది ప్రతాప్ రావుకు 1990 నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది .సంఘటన జరిగిన మంగళవారం రోజు రాత్రి ప్రతాప్ రావు మహబుబ్ నగర్ లో ఉన్నారు .కిడ్నాప్ వ్యవహరం తెలియడంతో …ఈ సమాచారంను మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి ప్రతాప్ రావు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది .దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కిడ్నాప్ వ్యవహరంను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు .ఇటు మీడియాలోను కిడ్నాప్ వ్యవహరం హైలెట్ కావడంతో పోలీసు అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు .

మొత్తంగా కిడ్నాప్ వ్యవహరంలో పోలీసులు విచారణను వేగవంతం చేసారు .చాలా కాలం తర్వాత హైదరబాద్ లో కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడం …మాజీ మంత్రి అరెస్టు కావడంతో ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయశంగా మారింది .